E-Paper
Advertisement

Bullet Train: 19 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!

Bullet Train: 19 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!
Advertisement

Bengaluru-Hyderabad bullet train: భారత్ లో బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబై నడుమ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 2027 వరకు ఈ మార్గంలో బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతోంది. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా భవిష్యత్ లో నిర్మించాల్సిన  హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గాలపైనా ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే సమీప భవిష్యత్తులో బెంగళూరు- హైదరాబాద్‌ ను బుల్లెట్ రైలు కలుపబోతోంది. రెండు ముఖ్యమైన దక్షిణ భారత రాజధాని నగరాల మధ్య ప్రస్తుతం ప్రయాణ సమయం 19 గంటలు ఉండగా, ఈ రైలు అందుబాటులోకి వస్తే, కేవలం 2 గంటల్లో పూర్తి కానుంది.

బుల్లెట్ రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?   

రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ (MAHSR) తరహాలో.. బెంగళూరు-హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కోసం DPR రెడీ అవుతోంది. మార్చి 2026 నాటికి రైల్వే బోర్డుకు దీనిని అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపబడుతుంది.  ప్రభుత్వ యాజమాన్యంలోని RITES లిమిటెడ్ ప్రస్తుతం ప్రతిపాదిత 626 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం తుది సర్వే, అలైన్‌ మెంట్ పనులను నిర్వహిస్తోంది. DPR సిద్ధమైన తర్వాత, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం కోసం పంపబడుతుందని కంపెనీ అధికారులు వెల్లడించారు.

బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు గరిష్ట వేగం ఎంతంటే?

Advertisement

బెంగళూరు-హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌ లో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. అయితే, ఆపరేషనల్ స్పీడ్ ను మాత్రం 320 కిమీకి పరిమితం చేయనున్నారు. ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు దక్షిణ భారతంలోని కీలక టెక్ కేంద్రాల మధ్య ప్రయాణ సమయాన్నిగణనీయంగా తగ్గించనుంది. 19 గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గనుంది. తగ్గిన ప్రయాణ సమయం వ్యాపారవేత్తలు, విద్యార్థులు, నిపుణులతో సహా అనేక మందికి ప్రయోజనం కలిగించనుంది.

ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణంలో భూసేకరణ సవాలుగా నిలిచే అవకాశం ఉంది. “భూసేకరణ పెద్ద సవాలు అవుతుంది. దీని నుంచి అదిగమించేందుకు మాకు రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అవసరం. సర్వేయర్లు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సంప్రదిస్తున్నారు” అనిదక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు.  “కర్ణాటకలో ఇప్పటికే పలు సమావేశాలు జరిగాయి. నిర్దిష్ట అలైన్‌ మెంట్‌ పై భూసేకరణ సాధ్యం కాకపోతే, ప్రణాళికను మార్చాల్సి ఉంటుంది.   అలైన్‌మెంట్‌ ను ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోబోతున్నాం” అని చెప్పుకొచ్చారు. బెంగళూరు-హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సిఫార్సు చేశారు. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రాజెక్టులకు సర్వేలను వేగవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

Advertisement

Read Also:  ఆ రైళ్లకు వందేభారత్ ను తలదన్నే వేగం.. గంటకు ఎంత స్పీడ్ తో దూసుకెళ్తాయంటే?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×