E-Paper
Advertisement

Goa Tour: కేవలం రూ.13వేలతో సముద్రంలో విహారయాత్ర.. బుకింగ్స్ మొదలయ్యాయి

Goa Tour: కేవలం రూ.13వేలతో సముద్రంలో విహారయాత్ర.. బుకింగ్స్ మొదలయ్యాయి
Advertisement

Goa Tour: గోవా పేరు వినగానే మనసు సముద్రపు అలల్లా ఉప్పొంగిపోతుంది. తెల్లటి ఇసుక బీచ్‌లు, నైట్ లైఫ్, సంగీతం, వేడుకలు, కళ్ళ ముందే సినిమా సన్నివేశంలా నిలుస్తాయి. కానీ సముద్రాన్ని తీరంలోనుండి చూడటం ఒక అనుభవమైతే, అలల మధ్యలో ప్రయాణిస్తూ గోవాను చూడటం మరో ప్రపంచమే. భారీ తెల్లటి క్రూయిజ్ నౌకపై అడుగుపెట్టిన క్షణం నుంచే జీవితం కొత్త రంగుల్లో మెరుస్తుంది. నౌక మెల్లగా కదులుతూ అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లే దృశ్యం, పైన డెక్ మీద నిలబడి ముఖాన్ని తాకే సముద్రపు గాలి, చుట్టూ నీలిరంగుతో మెరిసిపోతున్న నీరు… ఆ క్షణాలు మనసును పూర్తిగా మైమరపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో ఆకాశం నారింజ రంగుతో నిండిపోతూ అదే రంగు సముద్రంపై ప్రతిబింబించినప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తూ చేతిలో డ్రింక్ పట్టుకుని నిలబడి ఉంటే, మాటల్లో చెప్పలేని మాయలోకి మనసు జారిపోతుంది.

క్రూయిజ్ యాత్ర జీవతంలో గుర్తుండిపోయే జ్ఞాపకం

Advertisement

రాత్రి వెలుతురు ప్రారంభమయ్యే సమయానికి అసలు క్రూయిజ్ దాని మ్యాజిక్ రూపం తెరపెడుతుంది. సంగీతం ఉరుముతుంది, రంగుల లైట్లు ఆకాశాన్నే ఉత్సవంలా మార్చేస్తాయి, డ్యాన్స్ షోలు మొదలవుతాయి, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ వేదికను కదిలిస్తాయి, నక్షత్రాలు సముద్రం మీద జారుతున్న వెండి బొమ్మల్లా మెరిసిపోతాయి. ఈ సమయంలో సముద్రపు నిశ్శబ్దం, సంగీతం కలిసిపోయి మనసు అందమైన కలల లోకంలోకి వెళ్లిపోతుంది. కపుల్స్ ఒకరికొకరు చేతులు పట్టుకుని అలలను చూస్తూ నవ్వుకుంటూ గడిపే క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. పిల్లలు గేమ్ ఏరియాలో ఆడుకుంటూ ఆనందపడుతుంటే, పెద్దలు లౌంజ్‌లో రిలాక్స్ అవుతారు, యువత పార్టీ నైట్‌లో ఎనర్జీతో డ్యాన్స్ చేస్తుంటారు. అందరికి ప్రత్యేకమైన సంతోషంగా మారుతుంది.

Also Read: Samsung New 5G Phone: కేవలం రూ.13వేలలోపే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. అదికూడా 7000mAh బ్యాటరీతో..

Advertisement

కళ్లు తెరిచే సరికి గొప్ప అనుభూతి

ఉదయం నిద్రలేచిన వెంటనే కిటికీ ఓపెన్ చేస్తే నీలిరంగు అలలు బంగారు వెలుతురులో తళతళా మెరిసిపోతూ కళ్లను ఆనందాన్ని కలిగిస్తాయి. అలల శబ్దం నెమ్మదిగా చెవుల్లో మోగుతుంటే ప్రపంచంలో ఇంత ప్రశాంతమైన క్షణం ఇంకెక్కడ ఉంటుంది అని అనిపిస్తుంది. క్రూయిజ్ గోవా తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు బంగారు రంగు ఇసుక తీరాలు దూరం నుంచి కనిపించడం మనసులో అసూయ కలిగించేంత అందంగా ఉంటుంది. క్రూయిజ్ ప్యాకేజీలోనే గోవాలోని ప్రసిద్ధ చర్చిలు, బీచ్‌లు, అడ్వెంచర్ గేమ్స్ అయిన కయాకింగ్, బనానా రైడ్, జెట్ స్కీ అనుభవాలు కూడా ఉంటాయి. జీవితాన్ని ఆనందంతో నింపే అన్ని అనుభూతులు ఒకే ప్రయాణంలో కలిసి వస్తాయి.

క్రూయిజ్ ప్యాకేజీ ధర ఎంతంటే?

ఈ మొత్తం అనుభవాన్ని అందించే గోవా క్రూయిజ్ ప్యాకేజీ ధర రూ.12577 నుండి ప్రారంభమవుతోంది. ఈ మొత్తంలో భోజనం, డ్రింక్స్, షోలు, వినోద కార్యక్రమాలు, గదులు, క్రూయిజ్ టూర్, గోవా లోకల్ టూర్స్ అన్నీ కలుపుకుని ఇస్తారు. అదనపు ఖర్చు కోసం టెక్షన్ పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ నెల నుండి అధికారిక సైలింగ్స్ (Sailing) ప్రారంభం కానున్నాయి, నూతన సంవత్సర సీజన్ దగ్గర్లోనే ఉండటంతో స్లాట్లు వేగంగా ఫుల్ అవుతున్నాయి, అందుకే ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. బుకింగ్ కోసం Cordelia Cruises అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు, లేదా మీకు తెలిసినన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా సహాయం పొందవచ్చు. బుకింగ్ వివరాలు, తేదీలు, కేబిన్ ఎంపికలు అన్నీ అక్కడే అందుబాటులో ఉంటాయి.

అలల మధ్య ఆనందం

జీవితంలో ఒకసారి తప్పక అనుభవించాల్సిన జ్ఞాపకం అంటే ఇది. సముద్రం మధ్యలో నిలబడి అలలను చూస్తూ మనసు కొత్తగా పుడుతుంది. ప్రపంచం ఎంత అందంగా ఉందో మనం తిరిగి గుర్తుకుంటాం, సంతోషం అంటే ఏమిటో మనసు మళ్ళీ తెలుసుకుంటుంది. నవ్వులు, సంగీతం, అలలు, వెలుగులు, గాలి వీటన్నింటి కలయికే గోవా క్రూయిజ్.

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×