Best Road Trips: గమ్యం కంటే ప్రయాణం చాలా అందమైనది అని అంటారు చాలా మంది. మీర రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే మీ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చే సుందరమైన ప్రదేశాలు చూడండి. ఉత్తేజకరమైన రోడ్ ట్రిప్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ విహార యాత్ర కోసం అద్భుతమైన పర్వత వీక్షణాలు మొదలుకొని, నిర్మలమైన తీరప్రాంతాల వరకు, ఈ రోడ్ ట్రిప్ గమ్యస్థానాలు తెలుసుకోండి.
లడఖ్:
లడఖ్ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ప్రయాణాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారి అయిన అక్కడికి వెళ్లాలనుకునేవారు లక్షల మంది ఉంటారు. హిమాలయ పర్వతాల అందాలు, చూడముచ్చటగా ఉండే లోయలు, మంచు కరిగి ప్రవహించే హిమనీ నదులు, అందమైన సరస్సులు ఈ ప్రదేశాన్ని భూమ్మీదే అత్యంత అందమైనదిగా మార్చేశాయి. దీంతో అక్కడ విహరిస్తే మరో ప్రపంచంలో ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశాన్ని ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు.
అహ్మదాబాద్ to కచ్:
అహ్మాదాబాద్ నుండి కచ్‌కు రోడ్డు యాత్ర ఒక అద్బుతమైన అనుభవం. ఈ ప్రయాణం గుజరాత్‌లోని విభిన్న సంస్కృతులు, ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలకు మంచి ప్రయాణం. ఈ ప్రయాణం 400 కిలో మీటర్లకు పైగా ఉంటుంది. ఈ ప్రయాణం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న కచ్ యొక్క మైదానాలకు చేరుస్తుంది.
పాండిచ్చేరి to ధనుష్కోటి:
పాండిచ్చేరి నుంచి ధనుష్కోటి అందమైన తీరప్రాంత రహదారి వెంట ప్రయాణిస్తూ, మధ్యలో అనేక ఆసక్తికరమైప ప్రదేశాలను సందర్శించవచ్చు. ధనుష్కోటి చేరుకున్న తర్వాత అక్కడ మీరు ఒక వింతైన మరియు అందమైన వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఎందుకంటే ఇది 1964 తుఫానులో ధ్వంసమైన ఒక పట్టణం. దీనిని ‘ది ఘోస్ట్ టౌన్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వెళ్లే సమయంలో మీరు సముద్రం మధ్యలో రోడ్డు పై ప్రయాణించవచ్చు.
సిమ్లా to కాజా:
సిమ్లా నుంచి కాజాకు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఒక సాహసోపేతమైన అనుభవం. ఈ ప్రయాణం సుమారు 450 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రెండు రోజుల సమయం పడుతుంది. మార్గ మధ్యలో ఎత్తైన కొండలు, లోతైన లోయలు, మలుపులు తిరిగే రోడ్లు ఉంటాయి.
బెంగళూరు to మున్నార్:
బెంగళూరు నుంచి మున్నార్‌కి సుమారు 512 కిలోమీటర్లు దూరం మరిము 9 నుంచి 10 గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు, సాహసికులకు ఒక గొప్ప అవకాశం. మున్నార్‌లో టీ తోటలు చాలా ప్రసిద్ధి చెందినవి. మీరు వాటిలో నడవడం, టీ తయారు చేసే ప్రక్రియను చూడటం, టీ రుచి చూడటం వంటివి చేయవచ్చు. దీంతో మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
Also Read: ఊపిరి పీల్చలేకపోతున్నారా? బొద్దింకలే కారణం కావచ్చు!
మాంగళూరు to గోవా:
రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం ఒక ఆహ్లాదకరమైన అనుభవం. ఈ ప్రయాణంలో మీరు అందమైన ప్రదేశాలను, అలాగే ప్రకృతి అందాలను సందర్శించవచ్చు. ఈ రెండింటి మార్గ మధ్యమంలో గోకర్ణ అనే పురాతన తీర్థయాత్ర, బీచ్‌లతో కూడిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ మీరు ఓం బీచ్, క్లుడే బీచ్ వంటి ప్రదేశాలను కూడా చూడవచ్చు.