Viral Video : భారతదేశం వసుదైక కుటుంబం. దేశంలో పరమత సహనం. హిందూ ముస్లిం బాయీ బాయీ. మనుషులంతా ఒక్కటే. ఇదంతా గతం. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు రేగుతోంది. హిందూ వర్సెస్ ముస్లిం వివాదాలు ముదురుతున్నాయి. హింస చెలరేగుతోంది. ఒకరిని మరొకరు శత్రువులుగా చూసుకుంటున్నారు. ఇంతటి ధ్వేషపూరిత పరిస్థితుల్లోనూ అక్కడక్కడా అరుదైన ఘటనలు జరుగుతున్నాయి. అలాంటిదే ఈ న్యూస్.
కొందరు హిందువులు దర్గాలకు వెళ్తుంటారు. కడప దర్గాలో చాలామంది హిందువులే కనిపిస్తుంటారు. కానీ, హిందూ ఆలయాలకు వెళ్లే ముస్లింలు అత్యంత అరుదు. దాదాపు ఉండరు. కానీ, లేటెస్ట్‌గా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ముస్లిం మహిళ శివాలయంలో పూజలు చేస్తోంది. బుర్ఖా వేసుకుని మరీ గుడిలో శివుడికి మొక్కుతోంది. నైవేధ్యం కూడా సమర్పించి.. దేవుడికి నమష్కారం చేసింది. అందుకే ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విశ్వాసానికి మతం లేదు.. అంటూ నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
యూపీ, కాన్పూర్‌కు చెందిన ఆ ముస్లిం మహిళ సోదరుడు తీవ అనారోగ్యంతో ఉన్నాడు. హాస్పిటల్స్‌లో చూపించినా కోలుకోలేదు. దర్గాల్లో ప్రార్థనలు చేసినా లాభం లేదు. అతన్ని ఎలా బతికించుకోవాలో వారికి తెలీలేదు. ఆఖరి ప్రయత్నంగా శివుడిని వేడుకుంది ఆ ముస్లిం మహిళ. దేవుడా ఎలాగైనా తన సోదరుడి ప్రాణాలు కాపాడమని వేడుకుంది. పరమశివుడు ఆమె ఆవేదన విన్నట్టున్నాడు. కొంతకాలానికి అతని ఆరోగ్యం మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్నాడు. ఇదంతా శివయ్య మహత్యమే అనుకుందామె. కృతజ్ఞతను మరోసారి ఆ శివాలయానికి వచ్చింది. నైవేధ్యం సమర్పించింది. పూజలు చేసి శివుడికి మొక్కింది. ఆ వీడియోనే ఇది. కళ్యాణ్‌పూర్‌లోని అవంతిపురంలో ఓ వీధిలో రోడ్డు పక్కనే ఉన్న చిన్న శివాలయం అది. ముస్లిం మహిళ పూజలతో ఆ టెంపుల్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌గా మారింది.
ముస్లిం మహిళ నమ్మకాన్ని, ఆలయంలో పూజలు చేయడాన్ని చాలామంది నెటిజన్లు సమర్థిస్తున్నారు. మా దేవుడు గొప్పని కొందరు.. విశ్వాసానికి మతం లేదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆమెను అవమానిస్తూ ఇంకో వర్గం సైతం పోస్టులు పెడుతోంది. ఇలా ఆ వీడియో సోషల్ మీడియాలో సెన్షేషనల్‌గా నిలిచింది.
Muslim woman from #Kanpur offered prayers in a temple.
Reports state that her brother was critically ill & despite doing everything, his condition didn’t improve.
In a moment of desperation, she visited the temple seeking lord Shiva’s help.
MIRACULOUSLY her brother recovered. pic.twitter.com/1LAeVm8Kak
— ʋɛʀǟƈɨօʊֆ (@conscientious1o) June 26, 2025