బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లయిన జంటలు, ప్రేమికులు అందరూ గోవాకి వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. గోవా ఎంతో మందికి ఇష్టమైన గమ్యస్థానంగా మారిపోయింది. అక్కడ వాతావరణం ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాదు స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. గోవాలో మద్యం, క్యాసినోలు చాలా చౌకగా ఉంటాయి. ఇక బీచ్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాత్రి పగలు బీచ్ లోనే ఉండిపోయేవారు ఎంతోమంది. మీరు కూడా గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తే అక్కడ పద్ధతులను తెలుసుకోవాలి. కొన్ని రకాల పనులు చేయకూడదు. ఆ పనులు చేస్తే నేరుగా జైలుకే వెళతారు.
మద్యం బాటిళ్లతో
గోవాలో బీచ్ పార్టీలు అధికంగా జరుగుతాయి. ఆ బీచ్ పార్టీలలో మద్యం తాగుతారు. పాటలు పాడుతూ డాన్సులు చేస్తారు. అయితే కొంతమంది మద్యం తాగుతూ బీర్ బాటిల్ పట్టుకొని బీచ్ లో తిరుగుతూ తాగాలని అనుకుంటారు. అలా బీచ్ లో మద్యం బాటిల్ పట్టుకొని తిరుగుతూ పోలీసుల కంట పడకూడదు. మీరు మద్యం తాగాలి అనుకుంటే ఏదైనా రెస్టారెంట్, కేఫ్ లేదా పార్టీలో ఒక చోట మాత్రమే కూర్చుని ఎంజాయ్ చేయాలి. అంతేతప్ప బీచ్ మొత్తం బహిరంగంగా తిరుగుతూ మద్యం సేవించకూడదు.
చెత్తను వేయకూడదు
గోవా బీచులలో చెత్తను వేయకూడదు. మీరు తాగేసిన మద్యం బాటిల్స్, తినేసిన చాక్లెట్ రేపర్స్ వంటివి గోవా బీచ్ లో పడేస్తే మీకు జరిమానా పడుతుంది. గోవా బీచులలో ప్రేమికులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని సంతోషంగా నడుస్తూ ఎంజాయ్ చేయవచ్చు. కానీ పబ్లిక్ గా ముద్దులు పెట్టుకుంటూ అశ్లీల పనులకు పాల్పడితే మాత్రం జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
ఇలా చేస్తే ఇబ్బందే
బీచులలో మీకు మీరు సెల్ఫీలు తీసుకోవచ్చు లేదా ఇతరులను అడిగి మీ ఫోటోలు మీరు తీయించుకోవచ్చు. కానీ ఇతర వ్యక్తుల ఫోటోలు వారి అనుమతి లేకుండా తీయకూడదు. అలా తీస్తే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. కొంతమంది యువకులు బీచ్ లో ఉన్న విదేశీయులను, విదేశీ మహిళలను ఎగతాళి చేయడం వంటివి చేస్తారు. అలాంటి పనులకు కూడా జైలు శిక్ష తప్పదు.
గోవాలో నచ్చినట్టు బతకచ్చు. అలా అని దుస్తులు లేకుండా తిరగకూడదు. చాలామంది బీచులలో ఉత్సాహంతో దుస్తులను విప్పేస్తూ ఉంటారు. ఇలా చేయడం అనేది కిందకు వస్తుంది. పోలీసులు చూస్తే ఖచ్చితంగా అరెస్టు చేస్తారు. అలాగే క్యాసినో లో ఆడిన తర్వాత డబ్బు ఓడిపోతే గొడవలు చేయడం అరవడం వంటివి చేయకూడదు. అలా చేసినా కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.