E-Paper
Advertisement

రూ.13 వేల కోట్లతో మలక్కా జలసంధికి దగ్గరలో మెగా ఎయిర్‌పోర్ట్.. భారత్ కీలక నిర్ణయం!

రూ.13 వేల కోట్లతో మలక్కా జలసంధికి దగ్గరలో మెగా ఎయిర్‌పోర్ట్.. భారత్ కీలక నిర్ణయం!
Advertisement

Great Nicobar Airport Project: గ్రేట్ నికోబార్ ద్వీపంలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. సుమారు రూ.13,000 కోట్ల వ్యయంతో కొత్త గ్రీన్‌ ఫీల్డ్ పౌర-సైనిక విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రయం గ్రేట్ నికోబార్ ద్వీపంలోని గలాథియా బే సమీపంలోని చింగెన్ ప్రాంతంలో నిర్మించనున్నారు.  ఇది పౌర విమానయానంతో పాటు రక్షణ అవసరాలను కూడా తీర్చేలా రూపొందించబడుతోంది.

ఐఎన్‌ఎస్ బాజ్ రన్‌వే విస్తరణ రద్దు!

కేంద్రం తాజా నిర్ణయంతో ప్రస్తుతం క్యాంప్‌ బెల్ బేలో ఉన్న భారత నావికాదళ ఎయిర్‌ స్టేషన్ ఐఎన్‌ఎస్ బాజ్ రన్‌ వే విస్తరణ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుతం అక్కడ 4,500 అడుగుల రన్‌ వే మాత్రమే ఉంది. దానిని 10,000 అడుగులకు పెంచాలని గతంలో ప్రతిపాదించారు. అయితే, భౌగోళిక పరిస్థితులు, భూ పరిమితులు, నావిగేషన్ సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల కొరత లాంటి కారణాల వల్ల విస్తరణ సాధ్యం కాదని అధ్యయనాలు తేల్చాయి. అంతేకాకుండా, రన్‌ వే విస్తరణ వల్ల అడవులు, గిరిజన ప్రాంతాలు, వన్యప్రాణుల ఆవాసాలపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. దీంతో కొత్త ప్రదేశంలో విమానాశ్రయం నిర్మించడమే ఉత్తమ మార్గమని నిర్ణయించారు.

భారత కు కీలక వ్యూహాత్మకం ప్రాంతం

Advertisement

గ్రేట్ నికోబార్ వ్యూహాత్మకంగా భారత్ కు అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధికి సమీపంలో ఉంది. ప్రపంచ వాణిజ్యంలో పెద్ద భాగం ఈ మార్గం గుండా సాగుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో బలమైన మౌలిక సదుపాయాలు ఉండటం భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

తూర్పు హిందూ మహాసముద్రంలో మరింత నిఘా

కొత్త విమానాశ్రయం పూర్తయితే తూర్పు హిందూ మహాసముద్రంలో భారతదేశ నిఘా సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది. సైనిక సామగ్రి, సిబ్బంది రవాణా వేగవంతం కావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం కూడా పెరుగుతుంది.

రూ. 81 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు

Advertisement

ఈ విమానాశ్రయం గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగం. మొత్తం రూ.81,000 కోట్ల వ్యయంతో అమలు చేయనున్న ఈ మెగా ప్రాజెక్టులో అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌ షిప్‌మెంట్ టెర్మినల్, టౌన్‌ షిప్ అభివృద్ధి, విద్యుత్ మౌలిక సదుపాయాలు లాంటి అంశాలు కూడా ఉన్నాయి. దీని ద్వారా గ్రేట్ నికోబార్‌ను అంతర్జాతీయ వాణిజ్య, రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

విమర్శలు వచ్చినప్పటికీ..

అటు ఈ ప్రాజెక్టుపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష పార్టీలు అడవుల నరికివేత, పగడపు దిబ్బలపై ప్రభావం, స్థానిక గిరిజన తెగల జీవన విధానానికి ముప్పు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి, భద్రత, అనుసంధానం అనే మూడు లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించింది.

Read Also: కాశ్మీర్-లడఖ్‌ కు 365 రోజుల కనెక్టివిటీ.. జోజిలా టన్నెల్ తవ్వకం పూర్తి!

Related News

వినాయక చవితి స్పెషల్ ట్రైన్లు వచ్చేశాయి.. వెంటనే రూట్లు, డేట్లు చెక్ చేసుకోండి!

జంతు ప్రేమికులకు సైతం.. వాంతు తెప్పించే జీవులు.. వరల్డ్ టాప్-5 ‘అగ్లీ’ యానిమల్స్!

వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?

ఆకాశంలో విమానం.. రెక్కపై బుసలు కొడుతున్న పాము.. నెట్టింట వీడియో వైరల్!

ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి కొత్త ‘తత్కాల్’ రూల్స్!

రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజలు.. తోటి ట్రావెలర్లు ఆందోళన, వీడియో వైరల్

Big Stories

Advertisement
×