E-Paper
Advertisement

ఆకాశంలో విమానం.. రెక్కపై బుసలు కొడుతున్న పాము.. నెట్టింట వీడియో వైరల్!

ఆకాశంలో విమానం.. రెక్కపై బుసలు కొడుతున్న పాము.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

Snake on Airplane Wing: విమానం టేకాఫ్ అయ్యేందుకు ముందు అన్ని రకాల భద్రతా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగే ఎలాంటి లోపం లేదని నిర్ధారించుకున్న తర్వాతే, గాల్లోకి ఎగిరేందుకు అనుమతిస్తారు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి, విమానాల్లో భద్రతా చర్యలపై పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో ఎగురుతున్న విమానం రెక్కపై నల్లటి పాము బుసలు కొడుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది నిజంగా జరిగిన సంఘటనా? లేక ఎడిట్ చేసిన వీడియోనా? అంటూ చర్చించుకుంటున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు? ఎక్కడ? తీశారనే విషయంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

విమానం రెక్కపై పడగ విప్పిన విషనాగు!

వైరల్ అవుతున్న వీడియోలో విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా, రెక్కపై నలుపు, గోధుమ రంగులో కనిపించే ఓ పాము తలను పైకెత్తి పడగ విప్పినట్లు కనిపిస్తోంది. కొన్ని క్షణాల పాటు అది గాలి ఒత్తిడిని తట్టుకుంటూ కదులుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. పాము విమానం ఇంజిన్‌ కు సమీపంలో ఉన్నట్లు కూడా కనిపించడంతో ఈ దృశ్యాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వీడియో కొన్ని సెకన్లే ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. అంత వేగంగా ప్రయాణిస్తున్న విమానం రెక్కపై ఒక పాము ఉండటం సాధ్యమేనా? అనే ప్రశ్నలు నెటిజన్లలో మొదలయ్యాయి. మరికొందరు ఒకవేళ ఈ ఘటన నిజమైతే, ఆ పాము విమానంలోని ఇతర భాగాల్లోకి వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నెటిజన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే?

వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు కనిపిస్తున్నాయి. కొందరు దీనిని సరదాగా తీసుకుని ఫన్నీ మీమ్స్, జోకులు వేస్తున్నారు.  మరికొందరు ఇది పూర్తిగా ఎడిటింగ్‌ వీడియో కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అంత ఎత్తులో, గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న విమానం రెక్కపై ఒక పాము నిలబడటం దాదాపు అసాధ్యమంటున్నారు. ఇంకొందరు భద్రతాపరమైన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో నిజమైతే, విమానం టేకాఫ్‌ కు ముందు నిర్వహించే భద్రతా తనిఖీలపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ స్టాఫ్, మెయింటెనెన్స్ సిబ్బంది తనిఖీల్లో పాము ఉందనే విషయం ఎలా గుర్తించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఏది ఏమైనప్పటికీ, విమానం రెక్కపై పాము కనిపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. నిజమా? నకిలీనా? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం రాకపోయినా, ఈ వీడియో మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Advertisement

Read Also: ఎయిర్ ఇండియా సూపర్ న్యూస్.. ఢిల్లీ-టొరంటో మధ్య ఇక నాన్‌స్టాప్ ఫ్లైట్!

Related News

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

QR కోడ్ స్కాన్ చేస్తే సెకన్లలో పేమెంట్.. భారత UPI చూసి జర్మన్ మంత్రి ఆశ్చర్యం!

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

Big Stories

Advertisement
×