E-Paper
Advertisement

వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Vaishno Devi Yatra Gets Faster: మాతా వైష్ణో దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌లో రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు కొత్తగా నాలుగు రైలు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే, యాత్రికుల ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది.

కత్రా ప్రయాణం ఇక మరింత ఈజీ

ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించడంతో పాటు భక్తులకు మరిన్ని ప్రయాణ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.

కొత్త రైళ్లు ఎక్కడి నుంచి నడుస్తాయంటే?

Advertisement

ఈ కొత్త రైళ్లలో ఒకటి న్యూఢిల్లీ నుంచి నేరుగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వరకు నడవనుంది. దీంతో దేశ రాజధాని నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైలు మార్పుల అవసరం ఉండదు. మరో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ జమ్మూ తావి నుంచి శ్రీనగర్ మధ్య రాకపోకలు సాగించనుంది. అలాగే, శ్రీనగర్ నుంచి జమ్మూ తావి వరకు మరో వందే భారత్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల కాశ్మీర్ ప్రాంతం నుంచి జమ్మూ, కత్రా వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది. నాలుగో రైలు అమృత్‌సర్‌ను శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాతో కలపనుంది. పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చే యాత్రికులు ఇకపై మధ్యలో రైళ్లు మార్చాల్సిన అవసరం లేకుండా నేరుగా కత్రాకు చేరుకోవచ్చు. ఈ కొత్త రైళ్ల రాకతో రద్దీ సమయాల్లో ప్రయాణికులకు సీట్ల అందుబాటులోకి రానున్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు వృద్ధులు, కుటుంబాలతో వచ్చే భక్తులకు కూడా ఎంతో ఉపయోగ పడనున్నాయి.

ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు

కొత్త వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రమాదాలను నివారించేందుకు ఆధునిక ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ అయిన  కవచ్ ను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సిబ్బందిని సంప్రదించేందుకు ఎమర్జెన్సీ బటన్లు, కమ్యూనికేషన్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో మెరుగైన ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు కూడా ఉంటాయి. మంటలు ఏర్పడితే వెంటనే గుర్తించి నియంత్రించే సాంకేతికతను ఉపయోగించారు. వందే భారత్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.

ప్రయాణికుల ఆరోగ్యం కోసం యూవీసీ టెక్నాలజీ

Advertisement

ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీ వ్యవస్థలో యూవీసీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా గాలిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాదు,అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు.

Read Also: స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!

ఒక్క రోజే 20 లక్షలకు పైగా రైలు టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త రికార్డు

మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్‌ తో ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ డేట్ ఫిక్స్.. ఇక హైస్పీడ్ జర్నీకి రెడీ!

Big Stories

Advertisement
×