E-Paper
Advertisement

రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజలు.. తోటి ట్రావెలర్లు ఆందోళన, వీడియో వైరల్

రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజలు.. తోటి ట్రావెలర్లు ఆందోళన, వీడియో వైరల్
Advertisement

Railway AC Coach: ప్రయాణికుడి పిచ్చి పరాకాష్టకు చేరింది.. ఫలితంగా ఓ ట్రావెలర్ ఏకంగా రైలు ఏసీ కోచ్‌లో పూజలు చేయడం తీవ్ర దుమారం రేగింది. అంతేకాదు బెంబేలెత్తిపోయిన తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన రైల్వే విభాగం, విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

రైలు ఏసీ కోచ్‌లో షాకింగ్ ఘటన-ఏ పని చేసినా దానికి అర్థం ఉంటుంది. ముఖ్యంగా పూజలు విషయంలో మనసులో ఉండాలే కానీ, దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. కానీ జార్ఖండ్‌కు చెందిన  ఆ ప్రయాణికుడు చేసిన నిర్వాకం తీవ్ర దుమారం రేపుతోంది. వేలాది మంది ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేశాడు. ఏమైనా పోయినా తనకేమీ కాదని భావించాడు.

Advertisement

ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు పూజలు-ఏసీ కోచ్‌లో దేవుడికి ప్రత్యేక పూజలు చేశాడు. దీపం వెలిగించి, అగరు బత్తీలు పెట్టడం, ఆపై మంత్రాలు చదవడం వివాదాస్పదంగా మారింది. కాసేపటికి ఆ బోగీ అంతా పొగతో నిండిపోయింది. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యాడు. సదరు ట్రావెలర్ వద్దకు వెళ్లి రైలులో నిప్పు వెలిగించడం ఎంత ప్రమాదకరమో వివరించారు.

తోటి ట్రావెలర్లు షాక్, ఆపై ఆందోళన– వాటిని  ఆర్పేయాలని సలహా ఇచ్చారు. సదరు ప్రయాణికుడిపై ఆ కోచ్‌లోని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ట్రావెలర్ మాత్రం ఈ తతంగాన్ని వీడియో చిత్రీకరించాడు. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. సదరు ప్రయాణికుడి యవ్వారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే ప్రయాణికులు, సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

రియాక్ట్ అయిన రైల్వే సేవా విభాగం-వ్యక్తిగత విశ్వాసాలు ముఖ్యమే అయినప్పటికీ,తోటి ప్రయాణికుల ప్రాణాలను ఈ విధంగా పెట్టడం ముమ్మాటికీ నేరమని అంటున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రం కావడంతో స్పందించింది రైల్వే శాఖ. దీనిపై రైల్వే సేవా విభాగం రియాక్ట్ అయ్యింది. దీనిపై విచారణ చేసేందుకు రైలు నంబర్, ప్రయాణం తేదీ, పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలని  కోరింది.

సమస్యల పరిష్కారం కోసం ప్రయాణికులు నేరుగా రైల్‌మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచన చేసింది. బోగీలో పొగ కారణంగా రైలు ఫైర్ అలారం మోగే అవకాశం ఉందని, నిప్పును వెలిగించడం అగ్ని ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

ALSO READ: మీ ప్రయాణాన్ని సులభతరం చేసే గూగుల్ మ్యాప్స్ ట్రిక్స్.. ప్రతి ట్రావెలర్ ఇవి  తెలుసుకోవడం తప్పనిసరి

ఏసీ కోచ్‌లలో పరుపులు, కర్టెన్లు, సీట్ల కుషన్లు వంటివి సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారని, అవి వేగంగా మంటలను అందుకుంటాయని అన్నారు. అగరుబత్తీల పొగకు ఆటోమేటిక్ స్మోక్ డిటెక్టర్లు యాక్టివేట్ అవుతుందని, రైలు ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ను సైతం ఆన్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు రైల్వే నిపుణులు.

 

Related News

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!

ఒక్క రోజే 20 లక్షలకు పైగా రైలు టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త రికార్డు

మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్‌ తో ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ డేట్ ఫిక్స్.. ఇక హైస్పీడ్ జర్నీకి రెడీ!

ఐఫోన్ 18 డ్యూయోనా? యూరప్ ట్రిప్పా? రూ.4.5 లక్షలతో ఈ దేశాలు హ్యాపీగా చుట్టేయొచ్చు!

ఢిల్లీలో రైళ్లకు బ్రేక్.. ఏకంగా 110 సర్వీసులపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే?

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

Big Stories

Advertisement
×