E-Paper
Advertisement

జంతు ప్రేమికులకు సైతం.. వాంతు తెప్పించే జీవులు.. వరల్డ్ టాప్-5 ‘అగ్లీ’ యానిమల్స్!

జంతు ప్రేమికులకు సైతం.. వాంతు తెప్పించే జీవులు.. వరల్డ్ టాప్-5 ‘అగ్లీ’ యానిమల్స్!
Advertisement

Ugliest Animals: ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. కొన్ని చూడగానే హత్తుకునేలా అనిపిస్తాయి. మరికొన్ని మాత్రం వింతైన, వికారమైన ఆకారాలతో ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి విచిత్రమైన, భయంకర జంతువుల గురించే ఈ కథనంలో చెప్పుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత వికారమైనవిగా ముద్రపడిన టాప్ 5 జంతువులు, వాటికి సంబంధించిన వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

బ్లాబ్‌ఫిష్ (The Blobfish)

సముద్రం లోతుల్లో నివసించే బ్లాబ్‌ఫిష్ ప్రపంచంలోనే అత్యంత వికారమైన జీవిగా పేరుగాంచింది. నీటి లోపల ఉన్నప్పుడు సాధారణ చేపలాగే అనిపించినా.. ఉపరితలానికి తీసుకొచ్చినప్పుడు దాని శరీరం జెల్లీలా మారి.. ముక్కు జారినట్టుగా విచిత్రంగా కనిపిస్తుంది. సముద్రం అడుగున ఉండే అధిక నీటి ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా దాని శరీరాకృతి రూపొందింది. దీనికి ఎలాంటి ఎముకలు, కండరాలు లేకపోవడం గమనార్హం.

బోడి ఎలుక (Naked Mole-Rat)

Advertisement

భూమి లోపల కన్నాల్లో నివసించే ఈ నగ్న మోల్-రాట్ (బోడి ఎలుక) రూపం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. దీని శరీరంపై వెంట్రుకలు ఉండవు. చర్మం ముడతలు పడి చూడటానికి వికారమైన భావన కలిగిస్తుంది. దీనికి తోడు నోటి వెలుపలికి పొడుచుకు వచ్చిన పెద్ద పళ్లు.. ఆ వికారానికి మరో యాడ్ అన్ అన్నమట. చూడటానికి ఎలా కనిపించినప్పటికీ.. వీటికి క్యాన్సర్ నిరోధక శక్తి ఉండటం విశేషం. వీటికి ఉండే నొప్పిని తట్టుకునే గుణం.. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ప్రోబోసిస్ కోతి (Proboscis Monkey)

బోర్నియో ద్వీపంలో మాత్రమే కనిపించే ప్రోబోసిస్ కోతికి.. అతిపెద్ద వేలాడే ముక్కు ఉంటుంది. ముఖ్యంగా మగ కోతుల్లో ఈ ముక్కు బాగా పెద్దగా.. వికారం అనిపించేలా ఉంటుంది. అయితే ఈ పెద్ద ముక్కు ద్వారానే మగకోతులు ఆడవాటిని ఆకర్షిస్తాయట. దీని పొట్ట కూడా చాలా పెద్దగా ఉంటూ.. ఆ జీవిని విచిత్రంగా మార్చడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది.

ఐ-ఐ (Aye-Aye)

Advertisement

మాడగాస్కర్ అడవుల్లో నివసించే ఒక రకమైన లేమూర్ జీవి ఈ ఐ-ఐ. దెయ్యాన్ని తలపించేలా పెద్ద కళ్లు, భారీ చెవులు, పొడవైన ముడతల వేళ్లు దీని సొంతం. రాత్రిపూట మాత్రమే తిరిగే ఈ జీవి.. చెట్ల బెరడును ఒలిచి లోపల ఉన్న పురుగులను వేటాడి తింటుంది. దీని ఆకారం భయానకంగా ఉండటంతో స్థానికులు దీనిని అపశకునంగా భావిస్తుంటారు.

Also Read: ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

సైగా యాంటిలోప్ (Saiga Antelope)

యురేషియా ప్రాంతంలో కనిపించే ఒక ప్రత్యేకమైన జింక జాతే.. ఈ సైగా యాంటిలోప్. దీని ముక్కు మిగతా జింకల కంటే పూర్తి భిన్నంగా, ఏనుగు తొండంలా కిందకు వాలి ఉంటుంది. విచిత్రంగా అనిపించే దీని ముక్కు.. దుమ్ము ధూళిని ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుందట. శీతల కాలంలో వీచే అతి చల్లటి గాలులను వెచ్చగా మార్చి ఊపిరితిత్తుల్లోకి పంపేందుకు ఈ ముక్కు ఎంతగానో సాయపడుతుందట.

Also Read: మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

Related News

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!

ఒక్క రోజే 20 లక్షలకు పైగా రైలు టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త రికార్డు

మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్‌ తో ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ డేట్ ఫిక్స్.. ఇక హైస్పీడ్ జర్నీకి రెడీ!

Big Stories

Advertisement
×