E-Paper
Advertisement

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!
Advertisement

Charlapalli Patna Special Trains: ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–పాట్నా మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. దీంతో బీహార్, తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది.

ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో..

ప్రత్యేక రైళ్ల పొడిగింపునకు సంబంధించి రైల్వే అధికారులు తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవులు, ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ కోసం ఈ మార్గంలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు

Advertisement

* రైల్వే అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, రైలు నెం. 03253 పాట్నా–చర్లపల్లి ప్రత్యేక రైలు సోమవారాలు, బుధవారాల్లో నడుస్తుంది. ఈ రైలుకు చెందిన మొత్తం 14 సర్వీసులను ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు.

* అటు రైలు నెం. 03254 చర్లపల్లి–పాట్నా ప్రత్యేక రైలు బుధవారాల్లో నడుస్తుంది. ఈ రైలుకు చెందిన ఏడు సర్వీసులు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్నాయి.

Advertisement

*మరోవైపు రైలు నెం. 03255 చర్లపల్లి–పాట్నా ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ఈ సర్వీసులను ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 18 వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ప్రత్యేక రైళ్లలో ఏ క్లాస్ కోచ్ లు ఉంటాయంటే?

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో పలు రకాల క్లాస్ కోచ్‌లను తీసుకొచ్చారు. ఇందులో 3AC, 3AC ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు తమ అవసరానికి అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపుతో చర్లపల్లి నుంచి పాట్నా, అలాగే పాట్నా నుంచి చర్లపల్లికి వెళ్లే ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించనుంది. ముఖ్యంగా రిజర్వేషన్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్, స్టాపేజీలు, టికెట్ బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారతీయ రైల్వే అధికారిక వెబ్‌ సైట్, ఐఆర్‌సీటీసీ ద్వారా తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవడం వల్ల ప్రయాణాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించే అవకాశం ఉంటుందన్నారు.

Read Also: 1,200 కి.మీ పూర్తి చేసిన హైడ్రోజన్ రైలు.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!

ఒక్క రోజే 20 లక్షలకు పైగా రైలు టికెట్ల బుకింగ్.. ఐఆర్‌సీటీసీ కొత్త రికార్డు

మీ రైలు ఎక్కడుంది? కోచ్ ఏ చోట ఆగుతుంది? ఈ యాప్‌ తో ఈజీగా తెలుసుకోవచ్చు!

ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్ డేట్ ఫిక్స్.. ఇక హైస్పీడ్ జర్నీకి రెడీ!

Big Stories

Advertisement
×