How To Book Shimla Toy Train: భారత్ లో అత్యంత ఆహ్లాదకరమైన రైల్వే ప్రయాణ మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ. దేశంలో అత్యంత సుందరమైన రైల్వే ప్రయాణాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొండ శిఖరాలు, దట్టమైన అడవులు, సొరంగాలు, వంతెనల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. పరుచుకున్న పచ్చదనం నడుమ ఈ రైలు వయ్యారంగా నడుస్తుంటే, పర్యాటకులు చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. కొండల రాణిగా పిలిచే ఈ రైలు ప్రయాణాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2007లో వారసత్వ సంపదగా ప్రకటించింది. 2008లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అంతేకాదు, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో టాయ్ ట్రైన్ నాల్గవ స్థానంలో నిలిచింది సత్తా చాటింది.
1903లో టాయ్ ట్రైన్ ప్రయాణం ప్రారంభం
అద్భుతమైన ఈ టాయ్ ట్రైన్ జర్నీ 1903లో ప్రారంభం అయ్యింది. బ్రిటీష్ పాలకులు వెకేషన్ ఎంజాయ్ చేయడం కోసం ఈ రైలు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కల్కా-సిమ్లా టాయ్ రైలు ప్రయాణ మార్గం 96 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ టాయ్ ట్రైన్ రైడ్ 102 సొరంగాలు, 864 వంతెనలు, 919 థ్రిల్లింగ్ మలుపుల మీదుగా వెళ్తుంది. దేశంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్‌లలో ఈ ట్రైన్ జర్నీ ఒకటి కావడం విశేషం.
సిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ రకాలు, ధర
సిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ నాలుగు రకాలుగా ఉంటుంది.
⦿ శివాలిక్ డీలక్స్ – టికెట్ ధర రూ. 500
⦿ రైల్ మోటార్ – టికెట్ ధర రూ. 300
⦿ హిమాలయన్ క్వీన్ – టికెట్ ధర రూ. 260
⦿ సిమ్లా- కల్కా ఎక్స్ ప్రెస్ – టికెట్ ధర రూ. 70
సిమ్లా టాయ్ రైలును టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
❂IRCTC అధికారిక వెబ్ సైట్ irctc.co.inని ఓపెన్ చేయాలి.
❂ మీ వివరాలను ముందుగా నమోదు చేసుకోవాలి.
❂ ట్రిప్ ప్లాన్ లింక్ ను క్లిక్ చేయాలి.
❂ ఎక్కడ రైలు ఎక్కాలి అనుకుంటున్నారో ఆ రైల్వే స్టేషన్ ను ఎంచుకోవాలి.
❂ ప్రయాణం చేయాల్సిన డేట్, టికెట్ రకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
❂ బుక్ టిక్కెట్ పై క్లిక్ చేయాలి.
❂ టికెట్ రిజర్వేషన్ పేజీ కనిపిస్తుంది. మరోసారి మీ రైలు వివరాలను చెక్ చేసుకోవాలి.
❂టికెట్ పేమెంట్ పూర్తి చేయాలి.
❂ మీరు పేమెంట్ కంప్లీట్ అయ్యాక టిక్కెట్ వివరాలతో SMS లేదంటే ఇ మెయిల్ లభిస్తుంది. దానిని మీరు ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.
❂ఈ ట్రైన్ టికెట్ ను రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఇ- టికెట్ ప్రింట్ అవుట్ లేదంటే, మీరు ఇచ్చిన అడ్రెస్ కు ఐ-టికెట్ పంపిస్తారు.
ఈ టికెట్ తో మీరు సెలెక్ట్ చేసుకున్న రోజు టాయ్ ట్రైన్ లో హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!