Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ఇప్పుడు విలన్ గా కూడా అంతే పేరును తెచ్చుకుంటున్నాడు. లెజెండ్ సినిమాతో విలనిజాన్ని చూపించడం మొదలుపెట్టిన జగ్గూభాయ్.. భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు. జగ్గూభాయ్ నటనకు ఫ్యాన్స్ అవ్వని వారుండరు.
అయితే సినిమాలను పక్కన పెడితే.. సోషల్ మీడియాలోజగపతి బాబుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన పెట్టే ఫోటోలకు.. క్యాప్షన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నిత్యం తన జీవితంలో జరిగే విషయాలను తనకు నచ్చిన పనులను వీడియో తీసి.. వాటికి తెలుగులో సెటైరికల్ గా క్యాప్షన్స్ రాస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఆయనను ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు.. ఆయనకు ఆయనే తన ఫొటోస్ ను, వీడియోస్ ను విమర్శించుకుంటాడు.
Nani: నానిఓదెల 2 టైటిల్ చెప్పేసిన న్యాచురల్ స్టార్.. పోతారు.. మొత్తం పోతారు
ఎలాంటి నిర్మొహమాటం లేకుండా తెలుగులో ఎంతో అద్భుతంగా సెటైర్స్ వేస్తాడు. మొన్నటికి మొన్న ఒక వీడియో పోస్ట్చేస్తూ.. ” కొంచెం స్టైల్ కొడదామని ఓవర్ యాక్షన్ చేశా.. బాగుంది అని చెప్పండి. హ్యాపీ అయిపోతా” అని రాసుకొచ్చాడు. ఆ వీడియోలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో జగ్గూభాయ్ కనిపించాడు. దానికి జైలర్ లోని హుకుం సాంగ్ ను యాడ్ చేసి పోస్ట్ చేశాడు. ఇక ఆ వీడియోను ఫ్యాన్స్ అందరూ సూపర్ ఉంది అని చెప్పుకొచ్చారు.
ఇక ఫ్యాన్స్ సూపర్ గా ఉంది అనడంతో అలాంటిందే మరో వీడియోను జగపతి బాబు షేర్ చేశాడు. ఈసారి వెట్టయాన్ టైటిల్ సాంగ్ ను యాడ్ చేసి పోస్ట్ చేశాడు. దీనికి క్యాప్షన్ గా.. “బాగున్నా అని చెప్పారు కాబట్టి హ్యాపీ అయిపోయి.. ఒళ్ళు బలిసి ఈ వీడియో పెట్టా” అని రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.
Prabhas- Mahesh Fans: ప్రభాస్ ఫ్యాన్స్ వదిలేశారు.. మీరెందుకు అంతలా రెచ్చిపోతున్నారు..
మొన్న ఓవర్ యాక్షన్ చేశా.. ఇప్పుడు ఒళ్లు బలిసి ఈ వీడియో పెట్టా భలే ఉన్నాయండి మీ క్యాప్షన్స్.. ఎవరు ఏమి అనకుండా మీకు మీరే ఇలా విమర్శించుకుంటున్నారా.. ? అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక జగ్గు భాయ్ ప్రస్తుతం SDT 18, సలార్ 2.. తదితర సినిమాల్లో నటిస్తున్నాడు.
Baggunna ani chepparu kabatti happy ayipoyi, vollu balisi ee video pettannu. pic.twitter.com/WfuAisau8F
— Jaggu Bhai (@IamJagguBhai) November 6, 2024