AkiraNandan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా పరిశ్రమ కి నటుడుగా కాకుండా టెక్నీషియన్ గా పరిచయం అవుదామని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ చూడడానికి బాగుంటాడు. తన హీరోని చేద్దాం అని చిరంజీవి వైఫ్ సురేఖ గారు చెప్పడం వలన పవన్ కళ్యాణ్ కి నటన వైపు అడుగులు వేసేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్యానంద్ (satyanand) దగ్గర యాక్టింగ్ నేర్చుకొని తెలుగు సినిమా పరిశ్రమలు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. సత్యానం దగ్గర చాలామంది నటన నేర్చుకున్నారు. నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సాధించుకున్న ప్రభాస్ (Prabhas) కూడా సత్యానంద దగ్గర నటన పాఠాలు నేర్చుకున్నాడు.
Also Read: Prabhas- Mahesh Fans: ప్రభాస్ ఫ్యాన్స్ ను చూసి నేర్చుకోండి.. మహేష్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటున్నట్లు సమాచారం అందిస్తుంది. అకిరా నందన్ సినిమాల్లోకి రాకముందే తనకంటూ మంచి పేరు సాధించుకున్నాడు. ఆ హైట్ వెయిట్ అంతా కూడా పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని అనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ లో కూడా హీరోలా కనిపిస్తాడు అకీరా. ఇక అకీరా (Akira Nandan) తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే చాలామంది బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. మామూలుగా కూడా చూడడానికి అకీరా చాలా స్టైలిష్ గా ఉంటాడు. అలానే మార్షల్ ఆర్ట్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ఇక సత్యానంద్ శిక్షణలో పర్ఫెక్ట్ గా నటన నేర్చుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే చూడడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.
Also Read: Hero Krishnudu: కృష్ణుడు తాతల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రేణు దేశాయ్ ( Renu Desai) దర్శకత్వం వహించిన ఒక సినిమాలో కూడా ఇదివరకే కనిపించాడు అకీరా. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న తరుణంలో కూడా సంధ్య థియేటర్ కి వస్తూ ఉంటాడు. అకిరా మామూలుగా కనిపిస్తే చాలు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజీ ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి లెగిసిని వీళ్ళు పిల్లలు కంటిన్యూ చేస్తారని చాలామంది అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఇదివరకే వన్ నేనొక్కడినే సినిమాలో కనిపించాడు. అకిరా హీరోగా త్వరలో సినిమా కూడా రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా వినిపిస్తుంది.