E-Paper
Advertisement

Vande Bharat Sleeper Train: అయ్య బాబోయ్.. వందేభారత్ స్లీపర్ కోచ్ ధర అంత ఉంటుందా?

Vande Bharat Sleeper Train: అయ్య బాబోయ్.. వందేభారత్ స్లీపర్ కోచ్ ధర అంత ఉంటుందా?
Advertisement

Vande Bharat Sleeper Train: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించబోతున్నాయి. హౌరా- గౌహతి మార్గంలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టడానికి ఇండియన్ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సెమీ హై స్పీడ్ రైలు సేవను ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) రైల్వే నడపబోతోంది. ICF టెక్నాలజీ సాయంతో BEML ఈ రైలును నిర్మించింది. ఆరెంజ్, గ్రే కలర్ లో ఉన్న ఈ రైలు గంటకు 180 కిలో మీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీయనుంది.

వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ

రైల్వే శాఖ వందేభారత్ ట్రైన్ సెట్స్ తయారీ వేగవంతం చేయాలని BEMLకు సూచించింది. ప్రస్తుతం 200 వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. 2026లో ఇండియన్ రైల్వే దేశ వ్యాప్తంగా 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

వందేభారత్ స్లీపర్ కోచ్ తయారీ ఖర్చు ఎంత?   

Advertisement

వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ రైళ్లపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ రైళ్ల తయారీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ఒక్కో కోచ్ ధర దాదాపు రూ. 8 నుండి రూ. 8.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక్కో రైలు కోచ్ ధర సాధారణంగా రూ. 10 నుంచి రూ. 10.5 కోట్ల మధ్య ఉండే మెట్రో కోచ్‌ల ధర కంటే తక్కువగా ఉంటుందన్నారు. ఈ కోచ్‌లను ICF(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) టెక్నాలజీని ఉపయోగించి BHEL అభివృద్ధి చేసింది. BHEL 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తుంది.

Read Also: 2026లో మార్కెట్లో అడుగు పెట్టబోతున్న.. లో కాస్ట్ యూత్ అట్రాక్షన్ బైక్స్!

వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి కీలక విషయాలు

Advertisement

⦿ మొత్తం కోచ్‌లు 16 ఉంటాయి. 11 కోచ్‌లు 3 టైర్, 4 కోచ్‌లు 2 టైర్, 1 కోచ్ 1AC ఉంటుంది.

⦿ ఒక్కో స్లీపర్ రైలులో ప్రయాణీకుల సామర్థ్యం 823 ఉంటుంది. 3 టైర్ లో 611 మంది, 2 టైర్ లో 188 మంది, 1 ఏసీలో 24 మంది ప్రయాణీకులు ఉంటారు.

⦿ గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుంది.

⦿ మెరుగైన కుషనింగ్‌తో ఎర్గోనామిక్‌గా రూపొందించిన బెర్త్‌లు మంచి కంఫర్ట్ ను అందించనున్నాయి.

⦿ ఈజీ రాకపోకల కోసం వెస్టిబ్యూల్స్‌ తో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి.

⦿ సుపీరియర్ సస్పెన్షన్, తక్కువ సౌండ్ తో మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.

⦿ కవచ్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్ తీసుకొచ్చారు.

⦿ అధునాతన కంట్రోల్, భద్రతా వ్యవస్థలతో లోకో పైలెట్ క్యాబిన్ ఏర్పాటు చేశారు.

Read Also:  రైల్వే గుడ్ న్యూస్.. ఆ యాప్ లో టికెట్లు బుక్ చేస్తే 3% డిస్కౌంట్!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×