Dear Comrade Hindi Remake: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి సక్సెస్ అయితే ఆ సినిమాని ఇతర భాషలలో డబ్బింగ్ చేస్తూ విడుదల చేయడం, లేదంటే ఆ సినిమా హక్కులను కొనుగోలు చేసి ఇతర భాషలలో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఇప్పటికే ఎన్నో సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయగా ,కొన్ని బాలీవుడ్ సినిమాలను కూడా సౌత్ ఇండస్ట్రీలో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా మరో టాలీవుడ్ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సందీప్ రెడ్డి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ రష్మిక (Rashmika) హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ (Dear Comrade)సినిమాని కూడా రీమేక్ చేయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) కైవసం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీ భాషకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూనే సినిమాలోని భావోద్వేగాలను యధావిధిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే ప్రముఖ నటుడు సిద్ధార్థ్ చతుర్వేది(siddharth chaturvedi) హీరోగా లాపతా లేడీస్ నటి ప్రతిభ రంతా హీరోయిన్ గా నటించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రీమేక్ గురించి జోరుగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని అధికారకంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను ఈ రీమేక్ సినిమాలో నటిస్తున్నాను అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని, రీమేక్స్ జోలికి తాను వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ప్రతిభా సైతం ఈ సినిమా గురించి అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాలని కోరారు.
క్రికెట్ క్రీడాకారిణిగా..
ఇలా ఈ ఇద్దరు సినిమా పట్ల విభిన్న రీతిలో స్పందించడంతో మరి ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. 2019 జూలై 26వ తేదీ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమాలో రష్మిక క్రికెట్ క్రీడాకారిణిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు రావడంతో మరోసారి ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.
Also Read: TOXIC The Movie : మరింత పవర్‌ఫుల్‌గా నాలుగో హీరోయిన్ లుక్… అందరూ లేడీ డాన్‌లే