E-Paper
Advertisement

Man Climbs Gopuram: తిరుపతిలో గోవిందరాస్వామి ఆలయం పైకెక్కిన మందుబాబు.. టీటీడీ ఏం చెప్పిందంటే?

Man Climbs Gopuram: తిరుపతిలో గోవిందరాస్వామి ఆలయం పైకెక్కిన మందుబాబు.. టీటీడీ ఏం చెప్పిందంటే?
Advertisement

Man Climbs Gopuram: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఓ వ్యక్తి హల్ చల్ చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ వ్యక్తి ఆలయ గోపురం పైకి ఎక్కడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని కిందకు దించడంతో ఘటన సద్దుమణిగింది. శుక్రవారం రాత్రి నిజామాబాద్‌కు చెందిన ‘తిరుపతి’ అనే వ్యక్తి ఇతర భక్తులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి ప్రవేశించాడని అధికారులు తెలిపారు. అతను గోపురం మార్గం ద్వారా పైకి వెళ్లడాన్ని గమనించిన విజిలెన్స్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది అతన్ని కిందకు తీసుకొచ్చి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గోపురం కలశాన్ని పగలగొట్టారన్న వార్తల్లో నిజం లేదని టిటిడి స్పష్టం చేసింది.

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఆలయం మూసివేసే సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సదరు వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. అతను ఆలయం లోపల ఉన్న గోపురం పైకి ఎక్కి కలశాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది.

Advertisement

అయితే, సదరు వ్యక్తి చేసిన డిమాండ్ వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తనకు ‘క్వార్టర్ మందు బాటిల్’ ఇస్తేనే గోపురం పైనుంచి కిందకు దిగుతానంటూ హల్ చల్ చేసినట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న తిరుపతి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని కిందకు దించేందుకు సుమారు మూడు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరకు అతన్ని కిందకు దించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతను మద్యం మత్తులోనే ఆలయంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. ఏకాంత సేవ సమయంలో విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి అతను లోపలికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పైనుంచి దూకుతానని లేదా కలశాన్ని పగులగొడతానని బెదిరించినట్లు తెలుస్తోంది.

Advertisement

సదరు వ్యక్తిని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన ‘తిరుపతి’గా అధికారులు గుర్తించారు. తాను గోపురం పైకి ఎక్కి మద్యం కావాలని డిమాండ్ చేసినట్లు విచారణలో తిరుపతి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే టిటిడి కూడా స్పందించింది.

Read Also: నారా కుటుంబానికి గాలి ద్రోహం చేశాడా! బళ్లారి చరిత్ర ఇదే..

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×