BigTV English

Indian Railways: ప్లాట్ ఫారమ్ టికెట్ కౌంటర్ లోనే కాదు, ఆన్ లైన్ లోనూ తీసుకోచ్చు, ఎలాగంటే?

Indian Railways: ప్లాట్ ఫారమ్ టికెట్ కౌంటర్ లోనే కాదు, ఆన్ లైన్ లోనూ తీసుకోచ్చు, ఎలాగంటే?

Railway Platform Ticket Booking: సాధారణంగా రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా ప్లాట్ ఫారమ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులను రైలు ఎక్కించడానికి స్టేషన్ కు తీసుకెళ్లినా, లేదంటే రైల్లో వచ్చే బంధువులను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లినా ప్లాట్ ఫారమ్ టికెట్ ఉండాలి. సాధారణంగా ప్లాట్ ఫారమ్ టికెట్ ను చాలా మంది కౌంటర్ లో తీసుకుంటారు. కొన్నిసార్లు కౌంటర్ ముందు ఎక్కువ క్యూ ఉండటం వల్ల టైమ్ వేస్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే ఆన్ లైన్ ద్వారా ప్లాట్ ఫారమ్ టికెట్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంతకీ ఆన్ లైన్ ద్వారా ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


యూటీఎస్ యాప్ తో ప్లాట్ ఫారమ్ టికెట్ కొనుగోలు

ప్లాట్ ఫారమ్ టికెట్ తో పాటు జనరల్ టికెట్లు బుక్ చేసుకునేలా భారతీయ రైల్వే సంస్థ యూటీఎస్‌ (UTS) అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైల్వేకు సంబంధించిన పలు ఆన్‌ లైన్ బుకింగ్ సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ అయి, బుకింగ్ సేవలను పొందవచ్చు. ఇండియన్ రైల్వేకు సంబంధించి ప్లాట్‌ ఫామ్ టికెట్లను ఆన్‌ లైన్‌ లో ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం..


⦿ ముందుగా యూటీఎస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని. సైన్ అప్ చేయాలి. మీ వివరాలను ఎంటర్ చేయాలి. UTS యాప్ వినియోగదారులు R-వాలెట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 3% బోనస్ పొందుతారు.

⦿ యాప్ హోమ్‌ పేజీలో ప్లాట్‌ ఫామ్ బుకింగ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.

⦿ ప్లాట్ ఫారమ్ టికెట్ కు సంబంధించి పేపర్‌ లెస్, పేపర్ లో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ సమీప స్టేషన్లలో మీకు అవసరమైన స్టేషన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

⦿ ముందుగా మీరు ప్లాట్‌ ఫామ్ టికెట్ కొనాలనుకుంటున్న స్టేషన్ పేరును సెలెక్ట్ చేయాలి. మీరు కొనాలనుకుంటున్న ప్లాట్ ఫారమ్ టికెట్స్ సంఖ్యను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత చెల్లింపులకు సంబంధించిన ఆప్షన్స్ ను ఎంచుకోవాలి. యాప్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్, UPI లాంటి ఎంపికలతో పాటు Rwallet ఆప్షన్ ఉంటుంది.

⦿ అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత టికెట్ బుక్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

⦿ చెల్లింపులు సక్సెస్ అయిన తర్వాత ప్లాట్ ఫారమ్ టికెట్ జనరేట్ అవుతుంది. ఈ టికెట్ ను మీ యాప్ లోని టికెట్ బుకింగ్ హిస్టరీలో చూసుకునే అవకాశం ఉంటుంది. స్టేషన్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు చెకింగ్ స్టాఫ్ కు ఈ టికెట్ ను చూపిస్తే సరిపోతుంది.

Read Also: థర్డ్ ఏసీ To స్లీపర్ క్లాస్.. వామ్మో రైల్లో ఇన్ని రకాల క్లాస్ లు ఉన్నాయా?

Related News

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

India Guinness Records: గిన్నిస్‌లో ఇండియా బ్లాస్ట్.. మెట్రో అదరగొట్టింది.. ఇదేం డిజైన్ బాబోయ్!

Meteorite: ఆకాశం నుంచి పడ్డ బంగారు ఉల్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్!

Local Trains: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 238 కొత్త రైళ్లకు సూపర్ ఫీచర్.. జర్నీ చాలా స్మార్ట్ గురూ!

Ramagundam Station: నిన్నటి వరకు ఆ స్టేషన్ జీరో.. ఇప్పుడు హీరో.. మీ సమీపంలోనే ఓ లుక్కేయండి!

Big Stories

×