BigTV English

Train Classes: థర్డ్ ఏసీ To స్లీపర్ క్లాస్.. వామ్మో రైల్లో ఇన్ని రకాల క్లాస్ లు ఉన్నాయా?

Train Classes: థర్డ్ ఏసీ To స్లీపర్ క్లాస్.. వామ్మో రైల్లో ఇన్ని రకాల క్లాస్ లు ఉన్నాయా?

Indian Railways Train Classes:  తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేయడానికి చాలా మంది రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ప్రయాణానికి కొద్ది రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. సాధారణంగా రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆయా తరగతులకు సంబంధించి ఆప్షన్స్ కనిపిస్తాయి. చాలా మంది ఏ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ కు గురవుతారు. ఈ నేపథ్యంలో అసలు రైల్లో ఎన్ని క్లాస్ లు ఉంటాయి. వాటిలో కల్పించే సదుపాయాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ సెకండ్ క్లాస్/జనరల్ క్లాస్: రైల్లో అత్యంత సాధారణ క్లాస్ ఇది. పేదలు ఎక్కువగా ఈ క్లాస్ లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు. టికెట్ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్లాస్ లో సీటుకు ముగ్గురు కూర్చునేలా సీటింగ్ ఉంటుంది. అయితే, టికెట్ తీసుకున్న వారందరికీ సీట్లు లభిస్తాయనే గ్యారెంటీ లేదు. రైల్లో చాలా తక్కువ జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.

⦿ స్లీపర్ క్లాస్: భారతీయ రైల్వేలో ఎక్కువ మంది ఈ క్లాస్ లో ప్రయాణించేందుకు ఇష్టపడుతారు. రాత్రిపూట పడుకునేలా ఈ క్లాస్ లో బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రైలులో 10కి మించి కోచ్ లు ఉంటాయి. ఒక్కో కోచ్ లో 72 సీట్లు ఉంటాయి. ఇది నాన్ ఏసీ క్లాస్.


⦿ 3A – త్రీ టైర్ ఏసీ: ఈ క్లాస్ లో సీట్లు ఇంచుమించు స్లీపర్ క్లాస్ లాగే ఉంటాయి. కానీ, ఇందులో ఏసీ ఉంటుంది. ఒక కోచ్ లో 72 బెర్తులు ఉంటాయి.

⦿ 2A – టూ టైర్ ఏసీ: ఇక ఈ క్లాస్ లో త్రీ టైర్ ఏసీతో పోల్చితే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. టూ టైర్ ఏసీ కోచ్ లలో ప్రయాణీకుల ప్రైవసీని కాపాడేలా కర్టెన్లు ఉంటాయి. పర్సనల్ రీడింగ్ ల్యాంపులు, ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి. టూ టైర్ ఏసీ కోచ్ లో కంపార్ట్ మెంట్ లో 6 బెర్తులు ఉంటాయి.

⦿ 1A – వన్ టైర్ ఏసీ: రైళ్లలో అత్యంత లగ్జరీ క్లాస్ ఇది. టికెట్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వన్ టైర్ ఏసీ టికెట్ ధర ఇంచుమించు విమాన టికెట్ ఛార్జీతో సమానంగా ఉంటుంది. ఈ క్లాస్ కోచ్ లో కేవలం 8 క్యాబిన్లు ఉంటాయి. ఒక్కోదాంట్లో 6 బెర్తులు ఉంటాయి. ప్రయాణీకులకు పూర్తి ప్రైవసీ ఉంటుంది. ప్రయాణీకులకు సాయం చేసేందుకు ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారు. ఈ కోచ్ లోని బెర్త్ లు చాలా లగ్జరీగా ఉంటాయి.

⦿ 3E- 3 టైర్ ఎకానమీ: ఇవి థర్డ్ ఏసీతో పోల్చితే కాస్త తక్కువ స్థలాన్ని అందిస్తాయి. సరసమైన ఎయిర్ కండిషన్డ్ ప్రయాణాన్ని అందించడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రైల్వే.  ప్రతి కంపార్ట్‌ మెంట్‌ లో రెండు వైపులా   అప్పర్, మిడిల్, లోయర్ బెర్తులను కలిగి ఉంటుంది. కారిడార్ వెంట రెండు సైడ్ బెర్త్‌లు అప్పర్, లోయర్ బెర్తులు ఉంటాయి.

⦿ EC-ఎగ్జిక్యూటివ్ చైర్ కార్: ఇది కూడా ఏసీ కోచ్ చైర్ కార్. ఇందులో బెర్తులు ఉండవు. కేవలం కూర్చొని ప్రయాణించాల్సి ఉంటుంది. సీట్ల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. ఒక్కో లైన్లో 4 సీట్లు ఉంటాయి. శతాబ్ది ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లలో ఈ కోచ్ లు ఉంటాయి.

⦿ CC- చైర్ కార్: CC లేదంటే చైర్ కార్ కోచ్ లు AC సీటర్ కోచ్ లు. ఇందులో ఒక్కో లైన్ లో 5 సీట్లు ఉంటాయి. స్వల్ప దూర ప్రయాణాలకు ఈ కోచ్ లు అనుకూలంగా ఉంటాయి.

Read Also: వృద్ధులు, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్!

Related News

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Bullet train India: బుల్లెట్ ట్రైన్ టైమ్ వచ్చేసింది.. ఇక మిగిలింది అదొక్కటే.. సిద్ధం కండి!

Big Stories

×