BigTV English

Musical Roads: ఈ రోడ్ల నుంచి సంగీతం వస్తుంది.. ఈ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే!

Musical Roads: ఈ రోడ్ల నుంచి సంగీతం వస్తుంది.. ఈ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే!

BIG TV LIVE Originals: ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాలనే ఉద్దేశంతో ఆయా దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో రహదారుల వెంట ఆహ్లాదకరమైన మొక్కలు నాటితే, మరికొన్నిచోట్ల ఆగి సేద తీరేందుకు పార్క్ లను ఏర్పాటు చేస్తారు. కానీ, ఓ దేశంలో ప్రయాణ సమయాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగేందుకు ఏకంగా రోడ్డే మ్యూజిక్ వినిపించేలా చేశారు. రోడ్డు మ్యూజిక్ వినిపించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ముందుగా ఈ వీడియో చూసేయండి.


హంగేరీలో మ్యూజికల్ రోడ్లు

హంగేరీలో మ్యూజికల్ రోడ్లు ప్రయాణీకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నిర్దిష్ట వేగంతో (60-80 కి.మీ) వాహనాలు రోడ్డు మీద ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ మీద వెళ్తుంటే వీనుల విందుగా మ్యూజిక్ వినిపిస్తుంది. సరైన వేగంతో నడిపిస్తే మ్యూజిక్ చక్కగా వినిపిస్తుంది. హంగేరీలో ప్రస్తుతం మూడు మ్యూజికల్ రోడ్లు ఉన్నాయి. ఇవి ప్రయాణీకులకు మరింత ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు.

హంగేరీలో మూడు మ్యూజికల్ రోడ్లు

హంగేరీలో మూడు మ్యూజికల్ రోడ్లు ఉన్నాయి. మూడు రోడ్లు మూడు రకాల మ్యూజిక్ అందిస్తాయి.  ఇంతకీ ఆ రోడ్లు ఏవంటే..

⦿ రోడ్ 67:  దీనిని 2019లో నిర్మించబడింది, ఇది మెర్న్యే- మెర్న్యేస్జెంట్మిక్లోస్ మధ్య ఉంటుంది. ఈ రోడ్డు హంగేరీ రాక్ బ్యాండ్ రిపబ్లిక్ కు సంబంధించిన ‘A 67-es út’ అనే పాటను ప్లే చేస్తుంది. ఈ రోడ్ బ్యాండ్ సింగర్ లాస్జ్లో బోడి స్మృతిలో నిర్మించబడింది.

⦿ రోడ్ 37: ఈ రోడ్డును 2022లో స్జెరెంక్స్ సమీపంలో నిర్మించారు. టోకాజ్ వైన్ రీజియన్‌ లో ఉంటుంది.  ఈ రోడ్డు హంగేరీ జానపద పాట ‘Érik a szőlő’ అనే పాటను ప్లే చేస్తుంది. ఈ రోడ్డు సుమారు అర కిలో మీటర్ పొడవు ఉంటుంది.

⦿ రోడ్ 21: 2024 సెప్టెంబర్ లో ఈ రోడ్డును నిర్మించారు. హెవెస్ కౌంటీలోని హట్వాన్- లోరించి మధ్య దీనిని ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు కూడా సుమారు అర కిలో మీటర్ దూరంలో ఉంటుంది. ఈ రోడ్డు ఇస్మెరోస్ ఆర్కోక్ బ్యాండ్ కు సంబంధించిన ‘Nélküled’ పాటను ప్లే చేస్తుంది.

ఈ రోడ్లు ఎలా పని చేస్తాయి?

సాధారణ రోడ్లలో తారును కత్తిరించి చిన్న చిన్న కమ్మీలను ఏర్పాటు చేశారు. కారు వాటిపైకి వెళ్ళినప్పుడు, టైర్లు వైబ్రేట్ అవుతాయి. ఈ వైబ్రేషన్ కు మ్యూజికల్ వినిపిస్తుంది. పొడవైన కమ్మీలు 61 మి.మీ దూరంలో ఉంటాయి. సరైన వేగంతో(సుమారు 60- 80 కి.మీ వేగంతో) ప్రయాణించినప్పుడు మ్యూజిక్ సంపూర్ణంగా వినిపిస్తుంది. చాలా వేగంగా లేదంటే నెమ్మదిగా వెళితే, పాట సరిగా వినిపించదు.

ఈ రోడ్లు ఎందుకు ప్రత్యేకమైనవంటే?

హంగేరీ మ్యూజికల్ రోడ్లు కేవలం సరదాగా అనిపించడమే కాదు, వాటి వెనుక చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాహనాలు గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు తగ్గి, భద్రతను కలిగిస్తుంది. ప్రజలు సంగీతాన్ని వినడానికి ఈ రోడ్లను సందర్శిస్తారు. ముఖ్యంగా టోకాజ్ లాంటి ప్రదేశాలలో పర్యాటకరంగం అభివృద్ధికి కారణం అవుతున్నాయి. ప్రతి మ్యూజికల్ రోడ్ హంగేరియన్ పాటను ప్లే చేస్తుంది. ఈ పాటల ద్వారా తమ సంస్కృతిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది హంగేరీ దేశం. అయితే, స్థానికులు ఎప్పుడూ ఒకే మ్యూజిక్ రావడం పట్ల విసుగు చెందుతున్నారు. ఇలాంటి మ్యూజికల్ రోడ్లు జపాన్, దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లోనూ ఉన్నాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Big Stories

×