BIG BREAKING : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా మరొక తొమ్మిది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అభిమానులకు ఒక పిడుగు లాంటి వార్త బయటకు వచ్చిందని చెప్పాలి. పవన్ వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీ విడుదల కాలేదని, మరోసారి ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా వాయిదా పడటానికి కారణం ఎడిటింగ్ పూర్తి అవ్వలేదని, సీజీఐ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికి విడుదల కాలేకపోతుందని, అందుకే మరోసారి ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఎడిటింగ్ పనులు పెండింగ్…
హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని పెద్ద ఎత్తున ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ సినిమాని ఉన్నఫలంగా వాయిదా వేసేయడంతో ఒక్కసారిగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి చాలా పనులు పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే నిర్మాతలు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సినిమా విడుదలకు కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా ఈ సినిమాని పూర్తిస్థాయిలో ఎడిటింగ్ చేయలేదు అలాగే సీజీఐ వర్క్ కూడా పూర్తి కాలేదు.సీజీఐ వర్క్ పూర్తి అయితేనే సినిమాని ఎడిటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక సినిమా ఎడిటింగ్ చేసిన అనంతరం ఈ సినిమాని సెన్సార్ బోర్డుకు పంపించగలరు.
రెండు రోజుల సమయం మాత్రమే ఉంది…
ఒక సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాతనే ఆ సినిమా మొదటి కాపీ బయటకు వస్తుంది. అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాని ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా పెద్ద ఎత్తున విడుదల కాబోతున్న నేపథ్యంలో మరొక రెండు రోజులలో ఈ సినిమాని ఓవర్సీస్ కు పంపించాల్సి ఉంటుంది. రెండు రోజుల సమయంలో ఈ పనులన్నీ పూర్తి కావడం కుదరని నేపథ్యంలోనే ఈ సినిమాని వాయిదా వేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి.
ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకుండా విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందని ,తద్వారా భారీ నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా అనుకున్న స్థాయిలో బిజినెస్ కూడా జరగలేదని, బయ్యర్లు కూడా ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల వాయిదా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే కచ్చితంగా ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంటుంది. లేదంటే దీనినే అవకాశంగా తీసుకొని కొందరు యాంటీ ఫ్యాన్స్ సినిమాపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.