E-Paper
Advertisement

మన్ననూర్, సోమశిల మీదుగా బుల్లెట్ రైలు.. ఆ ప్రాజెక్టులో కీలక మార్పులు!

మన్ననూర్, సోమశిల మీదుగా బుల్లెట్ రైలు.. ఆ ప్రాజెక్టులో కీలక మార్పులు!
Advertisement

Hyderabad-Bengaluru Bullet Train Route: తెలంగాణలో ప్రతిపాదిత హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట మహబూబ్‌ నగర్‌, వనపర్తి రోడ్ మార్గంగా కర్నూలుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించినప్పటికీ, ఇప్పుడు కొత్త అలైన్‌ మెంట్‌ను శంషాబాద్‌, మన్ననూర్‌, సోమశిల మీదుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ (NHSRCL) ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

కొత్త అలైన్ మెంట్ కు కారణం ఏంటి?

మహబూబ్‌నగర్ వైపు ఇప్పటికే సాధారణ రైల్వే మార్గం ఉండటంతో, రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. కొత్త హైస్పీడ్ రైలు మార్గం కోకాపేట నుంచి ప్రారంభమై శంషాబాద్ గుండా నల్లమల అటవీ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మన్ననూర్‌, సోమశిల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలుకు కలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రైమరీ అలైన్‌మెంట్ సర్వే చివరి దశలో ఉంది. తెలంగాణ పరిధిలో సుమారు 205 కిలోమీటర్ల మేర ఈ హైస్పీడ్ రైలు మార్గం ఉండనుంది.

హైదరాబాద్-బెంగళూరు రూట్ లో ఐదు రైల్వే స్టేషన్లు

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్-బెంగళూరు మార్గం ఒకటి. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టులో తెలంగాణలో ఐదు స్టేషన్లను ప్రతిపాదించారు. శంషాబాద్‌, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్లు, మన్ననూర్‌, సోమశిల దగ్గర స్టేషన్లు ఉండే అవకాశముంది. కోకాపేట నుంచి శంషాబాద్ వరకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్ వెంట ఉండగా, మరో మార్గం ORR బయటుగా వెళ్లేలా ప్రతిపాదించారు.

కొత్త అలైన్‌మెంట్‌పై పర్యావరణవేత్తల ఆందోళన

అయితే, ఈ కొత్త అలైన్‌ మెంట్‌ పై పర్యావరణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మార్గం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌, నల్లమల అటవీ ప్రాంతాల గుండా వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మన్ననూర్-శ్రీశైలం ప్రాంతం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన జోన్‌ గా గుర్తింపు పొందింది. హైస్పీడ్ రైలు నిర్మాణం వల్ల అడవి జీవుల సంచారానికి అంతరాయం కలగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారులు మాత్రం ఈ ప్రాజెక్టుకు అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమ్రాబాద్‌, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల గుండా వెళ్లే హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌ కు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దాదాపు రూ. 7,668 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్టులో పర్యావరణ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.

Advertisement

ఈ ఎలివేటెడ్ రోడ్ దాదాపు 54.9 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో 45 కిలోమీటర్లకు పైగా ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. వన్యప్రాణుల సంచారానికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక వయాడక్ట్‌ లు, కృష్ణా నదిపై భారీ సస్పెన్షన్ బ్రిడ్జ్‌ ను కూడా నిర్మించనున్నారు. ఈ రోడ్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలు తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం ఉన్న ప్రమాదకర ఘాట్ రోడ్లకు బదులుగా సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇదే మార్గంలో ప్రతిపాదిస్తున్న హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో తెలంగాణ రవాణా రంగంలో కీలక పాత్ర పోషించనుంది.

Read Also: థాయ్‌ లాండ్, బాలి ఎందుకు దండగ.. భారత్‌ లోనే వాటిని తలదన్నే టూరిస్ట్ స్పాట్స్ ఉండగా!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×