Hyderabad News: హైదరాబాద్ మెట్రో రైళ్లలో నిత్యం ప్రయాణించేవారికి ఊహించని శుభవార్త. మెట్రో రైలు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇది వరకు ప్రకటించింది యాజమాన్యం. తగ్గిన ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులపై చాలావరకు ఆర్థిక భారం తగ్గనుంది.ప్రయాణికులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
కొద్దిరోజుల కిందట హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచింది ఆ సంస్థ. మరి ఏమనుకుందో తెలీదుగానీ పెంచిన ఛార్జీలను సవరించింది. కొత్తగా సవరించిన ధరల ప్రకారం కనీస ఛార్జీ రూ.11, గరిష్ఠ ఛార్జీ రూ.69లుగా నిర్ధారించారు అధికారులు. తగ్గించిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
వివిధ దూరాలకు అనుగుణంగా ఛార్జీల తగ్గింపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెండు కిలోమీటర్ల వరకు ప్రయాణానికి అంతకుముందు రూ.12 ఛార్జీని శనివారం నుంచి రూ.11 లకు తగ్గించారు. రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరానికి 18 రూపాయల నుండి రూ.17 లకు తగ్గించారు. నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.30 బదులుగా రూ.28 ప్రస్తుతం ధరగా పేర్కొన్నారు.
ఇక ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల మధ్య దూరానికి రూ.40 నుండి రూ.37లకు తగ్గించారు. తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు రూ.50లకు గాను రూ.47 చెల్లిస్తే సరిపోతుంది. పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లకు రూ.55 నుంచి రూ.51కి తగ్గింది. పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లకు రూ.60 బదులు రూ.56 వసూలు చేయనున్నారు.
ALSO READ: వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణానికి సిద్ధమా? ఆ విషయాలు తెలుసుకోండి?
పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లకు రూ.66 నుంచి రూ.61 లకు ఛార్జీని తగ్గించారు. ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు రూ.70 కి బదులుగా రూ.65 తగ్గించారు. ఇరవై నాలుగు కిలోమీటర్లకు పైబడిన దూరానికి ప్రయాణిస్తే గరిష్ఠ ఛార్జీ రూ.75 ఉండేది. దాన్ని రూ.69కి తగ్గించారు. ఈ లెక్కన కనీస ఛార్జీ 11 రూపాయలు పేర్కొన్నారు. గరిష్ఠ ఛార్జీ 69 రూపాయలుగా ప్రస్తావంచారు.
గుడ్ న్యూస్.. రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీలు తగ్గింపు
హైదరాబాద్లో తగ్గించిన మెట్రో ధరలు శనివారం నుంచి అమలు
సవరించిన మెట్రో ఛార్జీల కనీస ధర రూ.11, గరిష్ఠ ధర రూ.69
రెండు కి.మీ వరకు మెట్రో ఛార్జీని రూ.12 నుంచి రూ.11కు తగ్గింపు#HyderabadMetro https://t.co/XSHAHO4Zt2 pic.twitter.com/s2tBS3oMqa
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2025