Trains Cancelled: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిన తర్వాత.. సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితి నెలకొంది. గుజరాత్, రాజస్థాన్‌లోని జైసల్మేర్ , శ్రీగంగానగర్ సరిహద్దు జిల్లాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. వైమానిక రక్షణ వ్యవస్థ అన్ని దాడులను తిప్పికొట్టింది. రాజస్థాన్‌లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించిన నేపథ్యంలో.. రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. దీంతో బార్మర్, జైసల్మేర్ వైపు వెళ్లే రైళ్లు రద్దు చేశారు.
సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం, అత్యవసర పరిస్థితి కారణంగా 5 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రభావం మే 9, 10 తేదీల్లో నడపాల్సిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లు, ప్రత్యేక రైళ్లపై పడింది.
మే 9 న నడిచే (రైలు నం. 22483) జోధ్‌పూర్-గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తో పాటు గాంధీధామ్-జోధ్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అంతే కాకుండా మే 10న నడపాల్సిన భుజ్–రాజ్‌కోట్–భుజ్ స్పెషల్ ట్రూన్ ను కూడా క్యాన్సిల్ చేశారు. ఇదిలా ఉంటే.. గుజరాత్ ప్రభుత్వం మే 15, వరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్‌లను ఎగురవేయడం, పటాకులు పేల్చడం వంటి వాటిపై కూడా నిషేధం విధించింది.
పలు మార్గదర్శకాలను పాటించాలని , అంతే కాకుండా ప్రస్తుతం వ్యాపించే పుకార్లకు శ్రద్ధ చూపకుండా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
పరిస్థితిని అంచనా వేయడానికి, ప్రజా సహకారం యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేయడానికి గుజరాత్ సీఎం అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరిగింది. ఇంకా.. రాజస్థాన్‌లో కూడా ఇలాంటి భద్రతా చర్యలు అమలులోకి వచ్చాయి.
Also Read: నేచర్ లవర్స్‌కి బెస్ట్ ప్లేస్.. సమ్మర్‌లో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు !
జైసల్మేర్ వంటి సరిహద్దు ప్రాంతాలలో.. మే 15 వరకు ఆంక్షలు విధించారు. అంతే కాకుండా అదనంగా, మే 9, 10 తేదీలలో సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు మౌంట్ అబూలో రెండు రోజుల బ్లాక్‌అవుట్ ప్రకటించబడింది.
గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు సాయంత్రం 7 గంటలకు ముందే తమ హోటళ్లకు తిరిగి రావాలని , బ్లాక్అవుట్ సమయంలో అన్ని లైట్లు ఆపివేయాలని కోరారు.