BigTV English

Sikkim Tour: నేచర్ లవర్స్‌కి బెస్ట్ ప్లేస్.. సమ్మర్‌లో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు !

Sikkim Tour: నేచర్ లవర్స్‌కి బెస్ట్ ప్లేస్.. సమ్మర్‌లో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు !

Sikkim Tour: సిక్కిం మన దేశంలో చాలా చిన్న రాష్ట్రమైనప్పటికీ..ఇక్కడి ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి ప్రకృతి సౌందర్యం మరెక్కడా కనిపించదు. ఈ రాష్ట్రం ప్రకృతి ప్రేమికులకు ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి అనేక ప్రదేశాల్లో మీరు సహజ సౌందర్యాన్ని చూడొచ్చు. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ప్రకృతి, నదులు, సరస్సులు, అందమైన జలపాతాలు, వివిధ రకాల జంతువులను చూడొచ్చు. అంతే కాకుండా సిక్కిం ప్రజల జీవితం, జీవనశైలి, ఆహారం, సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు.


సిక్కిం సంస్కృతి:
సిక్కిం సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే.. ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రదేశంలో చాలా మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తారు. అంతే కాకుండా చాలా ముక్కుసూటిగా, సరళంగా ఉంటారు. ఇక్కడ ఉన్న మఠాలలో ముసుగు వేసుకుని చేసే నృత్యం చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని ఇక్కడి లామాలు ప్రదర్శిస్తారు. సిక్కింలో చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ లు ఉన్నాయి. ఇవి మీ ట్రిప్‌ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి.

గాంగ్టక్:
శివాలిక్ కొండల మధ్యలో ఉన్న గాంగ్టక్, సిక్కింలో తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్. ఈ ప్రదేశం నుండి మీరు కాంచన్‌జంగా పర్వతాల యొక్క అందాలను చూడొచ్చు. ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యానికి, మతపరమైన అంశాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేష్ టోక్, హనుమాన్ టోక్ వంటి అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి దూర ప్రాంతాల నుండి జనం వస్తారు. గాంగ్‌టక్‌లో సందర్శించాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే.. నాథులా పాస్, ఎంజీ రోడ్, తాషి వ్యూ పాయింట్, రేషి హాట్ స్ప్రింగ్స్, హిమాలయన్ జూలాజికల్ పార్క్, బాబా హర్భజన్ సింగ్ టెంపుల్, సుక్ లా ఖాంగ్ మొనాస్టరీలను తప్పకుండా చూడాలి.


సోంగ్మో సరస్సు:
సిక్కింలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో సోంగ్మో సరస్సు ఒకటి. సోంగ్మో అనేది స్థానిక భాషా పదం. దీని అర్థం ‘నీటి వనరు’. సోంగ్మో సరస్సు నిజంగా సిక్కింకు ఒక భారీ నీటి వనరు. భారతదేశంలోని ఎత్తైన సరస్సులలో ఒకటైన సోంగ్మో అందాలకు పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. సోంగ్మో చుట్టూ ఉన్న మంచుతో కప్పబడిన పర్వతాల అందం మనల్ని కట్టిపడేస్తుంది.

యుక్సోం:
సిక్కింలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన యుక్సోం. దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. పచ్చని పర్వతాలతో కప్పబడిన ఈ ప్రదేశం.. కాంచనగంగా పర్వతానికి వెళ్ళే వారికి బేస్ క్యాంప్‌గా పనిచేస్తుంది. ప్రయాణికులు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని.. తరువాత తమ ప్రయాణానికి బయలుదేరుతారు. మీరు మీ స్నేహితులతో గడపాలని ప్లాన్ చేస్తుంటే ఇది సరైన ప్రదేశం. ఈ ప్రదేశంలో మీరు అనేక చారిత్రక కట్టడాలు, పురాతన మఠాలు, ప్రశాంతమైన జలపాతాలు , సరస్సులను కూడా చూడొచ్చు.

Also Read: ఒక్క రోజులో హైదరాబాద్ ట్రిప్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు !

నాథు లా పాస్:
సిక్కిం లోని అత్యంత ప్రత్యేక ఆకర్షణలలో నాథు లా పాస్ ఒకటి. టిబెట్‌కు చాలా దగ్గరగా ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి, మీరు రాజధాని గాంగ్‌టక్ నుండి దాదాపు 50 నుండి 55 కి.మీ ప్రయాణించాలి. ఈ ప్రదేశంలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళడం సాధారణంగా కష్టం. ఇది సైనిక స్థావరం కావడం వల్ల.. ఈ ప్రదేశంలో పర్యాటకుల రాకపోకలు పరిమితం. ఇది బుధవారం, గురువారం, శనివారం , ఆదివారం మాత్రమే తెరిచి ఉంటుంది.

సిక్కిం ఎలా చేరుకోవాలి ?
సిక్కిం భారతదేశంలోని ఒక రాష్ట్రం ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అన్ని పర్యాటక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు మీ సౌలభ్యం , బడ్జెట్ ప్రకారం ఎంచుకోవచ్చు. మీరు విమానంలో వెళ్లాలనుకుంటే పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ నుండి వెళ్లొచ్చు. మీరు ఇక్కడి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా గాంగ్టక్ చేరుకోవచ్చు. రైలులో వెళ్లాలని అనుకుంటే.. న్యూ జల్పైగురికి వెళ్లి ఇక్కడి నుండి గాంగ్టక్ కు దూరం కేవలం 117 కి.మీ. మీరు టాక్సీ లేదా బస్సు ద్వారా కూడా సిక్కిం చేరుకోవచ్చు.

Related News

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Big Stories

×