OTT War Movies : భారత్ – పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి యుద్ధ సమయంలో సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడతారు. సైనికుల త్యాగం, యుద్ధ వినాశనం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించే వార్ డ్రామాలు ఎన్నో ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అందులో కొన్ని బెస్ట్ సినిమాల గురించి తెలుసుకుందాం.
1. Eye In The Sky (2015)
ఆధునిక యుద్ధంలో డ్రోన్ ఆపరేషన్‌పై దృష్టి సారిస్తూ, కల్నల్ కేథరీన్ పావెల్ (హెలెన్ మిర్రెన్) నైరోబీలో ఉగ్రవాదులపై డ్రోన్ దాడిని చేస్తారు. కానీ టార్గెట్ లో ఒక చిన్న అమ్మాయి ఉండటంతో, ఏం చేయాలో తెలియని అయోమయంలో పడతారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : Amazon Prime Video
2. Tae Guk Gi: The Brotherhood of War (2004)
కొరియన్ యుద్ధం (1950-53) సమయంలో, దక్షిణ కొరియా సోదరులు జిన్-తే (జాంగ్ డాంగ్-గన్), జిన్-సియోక్ (వాన్ బిన్) బలవంతంగా సైన్యంలో చేరతారు. జిన్-తే, తన సోదరుడిని రక్షించేందుకు, ప్రమాదకరమైన మిషన్‌లలో పాల్గొంటాడు. సినిమాలో కుటుంబ బంధం, త్యాగం, యుద్ధం వినాశాన్ని చూపించారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు : ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్
3. 71 (2014)
1971లో ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో, బ్రిటిష్ సైనికుడు గ్యారీ హుక్ (జాక్ ఓ’కానెల్) అల్లర్ల సమయంలో తన టీం నుండి విడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న IRA (ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ) గెరిల్లాలు అతన్ని వెంబడిస్తాయి. గ్యారీ శత్రు భూభాగం నుంచి బయటపడేందుకు పోరాడతాడు. స్థానికులు, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతల నుంచి అతని సర్వైవల్ ఈ మూవీ కథ.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : ప్రైమ్ వీడియో
4. Glory (1989)
అమెరికన్ సివిల్ వార్ (1863) సమయంలో, కల్నల్ రాబర్ట్ గౌల్డ్ షా (మాథ్యూ బ్రోడెరిక్) 54వ మసాచుసెట్స్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు నాయకత్వం వహిస్తాడు. ఇది ఆఫ్రికన్-అమెరికన్ సైనికులతో రూపొందిన మొదటి యూనిట్. జాతి వివక్ష, శిక్షణ సవాళ్లను అధిగమించి… సైనికులైన ట్రిప్ (డెంజెల్ వాషింగ్టన్), రాసన్ (మోర్గాన్ ఫ్రీమాన్) ఫోర్ట్ వాగ్నర్ దాడిలో పాల్గొంటారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు: అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్
5. Enemy At The Gates (2001)
ప్రపంచ యుద్ధం IIలో స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం (1942-43) సమయంలో, సోవియట్ స్నిపర్ వాసిలీ జైత్సేవ్ (జూడ్ లా) జర్మన్ సైనికులను టార్గెట్ చేస్తాడు. అతనికి మంచి పేరు ఉండడం జర్మన్ ఎలైట్ స్నిపర్ మేజర్ కోనిగ్ (ఎడ్ హారిస్)ను ఆకర్షిస్తుంది. ఇది ఒక డెడ్‌లీ క్యాట్-అండ్-మౌస్ గేమ్‌కు దారి తీస్తుంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు : అమెజాన్ ప్రైమ్ వీడియో
6. The Thin Red Line (1998)
ప్రపంచ యుద్ధం IIలో గ్వాడల్కానల్ యుద్ధం (1942) సమయంలో, యూఎస్ ఆర్మీ రైఫుల్ కంపెనీ జపాన్ సైనికులతో పోరాడుతుంది. ప్రైవేట్ విట్ (జిమ్ కావిజెల్), సార్జెంట్ వెల్ష్ (సీన్ పెన్), కెప్టెన్ స్టారోస్ (ఎలియాస్ కోటియాస్) యుద్ధంలో మానవత్వం అన్నదే లేని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
7. We Were Soldiers (2002)
వియత్నాంలో జరిగిన మొదటి పెద్ద యుద్ధం (1965) ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. లెఫ్టినెంట్ కల్నల్ హాల్ మూర్ (మెల్ గిబ్సన్) 7వ కావల్రీ రెజిమెంట్‌ను డ్రాంగ్ వ్యాలీలో నడిపిస్తాడు. 450 మంది యూఎస్ సైనికులు 2000 మంది ఉత్తర వియత్నామీ సైనికులతో తలపడతారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : ప్రైమ్ వీడియో
Read Also : దేశభక్తిని పెంచే ది బెస్ట్ 10 మూవీస్ … ఈ ఓటీటీల్లోనే ఉన్నాయి.. ఓ లుక్కెయండి
8. All Quiet On The Western Front (2022)
ప్రపంచ యుద్ధం I (1917) సమయంలో, యువ జర్మన్ సైనికుడు పాల్ బామెర్ (ఫెలిక్స్ కమ్మెరెర్) దేశభక్తితో సైన్యంలో చేరతాడు. ఫ్రెంచ్ ట్రెంచ్‌లలో అతను యుద్ధం, క్రూరత్వం, ఆకలి వంటి సమస్యలతో పాటు చావు అంచులదాకా వెళతాడు. యుద్ధం సైకలాజికల్ గా ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ మూవీలో చూడాలి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : నెట్ ఫ్లిక్స్