Puri -Vijay Sethupathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన వారిలో పూరి జగన్నాథ్(Puri Jagannadh) ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా కొనసాగుతున్న వారంతా కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందుకున్న వారే. ఇటీవల పూరి జగన్నాథ్ సినిమాలు కాస్త ట్రాక్ తప్పాయనే చెప్పాలి. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు పూరి జగన్నాథ దర్శకత్వం వహించగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమాకు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టినట్టు సమాచారం. స్వయంగా ఈ విషయాన్ని పూరి కనెక్ట్స్ అధికారికంగా వెల్లడించారు. లాస్ట్ డే షూటింగ్లో చిత్ర బృందం బిజీగా ఉండగా నటి చార్మి వీడియో కాల్ ద్వారా విజయ సేతుపతి పూరి జగన్నాథ్ తో మాట్లాడిన ఒక వీడియోని విడుదల చేశారు. ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ కావడంతో చాలా బాధగా ఉంది అంటూ విజయ్ సేతుపతి మాట్లాడారు.
ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా విజయ్ సేతుపతి లుక్ ఎలా ఉండబోతుందో కూడా లీక్ కావటం గమనార్హం. ఈ వీడియోలో విజయ్ సేతుపతి చొక్కా లుంగీతో కనిపించడంతో సినిమాలో ఈయన లుక్ కూడా ఇలాగే ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కేవలం 5 నెలల వ్యవధిలోనే షూటింగ్ పనులను పూర్తి చేసుకోవటం విశేషం. జూలై నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాగా నవంబర్ చివరికి షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి కనీసం టైటిల్ కూడా విడుదల చేయకపోవడం గమనార్హం.
స్లమ్ డాగ్ గా పూరి సేతుపతి సినిమా..
And that’s a wrap for #PuriSethupathi 🎬
After months of an intense, emotional, and joyful journey on the sets, the team has completed the entire shooting process 💥
Get ready for some truly exciting updates soon ❤️🔥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥… pic.twitter.com/HAvLjhTNfX
— Puri Connects (@PuriConnects) November 24, 2025
గతంలో ఈ సినిమా టైటిల్ విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు కానీ అదే సమయంలో తమిళనాడు కరూర్ లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు “స్లమ్ డాగ్”(Slum Dog) అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ టైటిల్ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా నటి సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీనియర్ నటి టబు (Tabu) కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: BMW Film: రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఫస్ట్ సింగిల్ ..ముహూర్తం ఫిక్స్!