BigTV English

Indian Railway: ప్రయాణీకులకు అలర్ట్.. ఈ రైళ్ల పేర్లు, నెంబర్లు మారాయండోయ్!

Indian Railway: ప్రయాణీకులకు అలర్ట్.. ఈ రైళ్ల పేర్లు, నెంబర్లు మారాయండోయ్!

Trains Name Change: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానూ సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న పలు రైళ్లకు సంబంధించిన పేర్లను మార్చింది. అటు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాకపోకలు కొనసాగించే మరికొన్ని రైళ్లకు సంబంధించిన నంబర్లలో మార్పులు చేసింది. తాజాగా కొత్త నెంబర్ల లిస్టును విడుదల చేసింది. ఆయా రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.


పేర్లు మార్చిన రైళ్లు ఇవే!

హైరాబాద్ లో తాజాగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మరిన్ని రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగించే రెండు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి నడుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రైళ్లకు సంబంధించిన పేర్లను మార్చినట్లు వివరించారు. చెన్నైసెంట్రల్‌- హైదరాబాద్‌ ఎక్స్‌ ప్రెస్‌(12603) ఇకపై చర్లపల్లి నుంచి తన సేవలను కొనసాగించనుంది. దీని పేరును చెన్నైసెంట్రల్‌- చర్లపల్లి ఎక్స్ ప్రెస్ గా మార్చారు అధికారులు. అటు  హైదరాబాద్‌- చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ ప్రెస్‌(12604) పేరును చర్లపల్లి- చెన్నై సెంట్రల్‌ గా మార్చారు. మరోవైపు గోరఖ్‌ పూర్‌- సికింద్రాబాద్, సికింద్రాబాద్‌-గోరఖ్‌ పూర్‌ (12589, 12590) ఎక్స్ ప్రెస్ రైళ్ల పేర్లను  గోరఖ్‌ పూర్‌- చర్లపల్లి, చర్లపల్లి- గోరఖ్‌ పూర్‌ ఎక్స్‌ ప్రెస్‌ లుగా మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.


నంబర్లు మారిన రైళ్లు ఇవే!

మరోవైపు నూతనంగా ఏర్పడిన ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ నుంచి రాకపోకలు కొనసాగించే సుమారు 10 రైళ్లకు సంబంధించిన నెంబర్లను మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు విశాఖ-కడప రైలు నంబర్ 17488 ఉండగా తాజాగా 18521గా మార్చారు. అటు కడప- విశాఖ రైలు నంబర్ 17487 ఉండగా 18522గా ఛేంజ్ చేశారు. విశాఖ-గుంటూరు రైలు నంబర్ 22701 ఉండగా ఇప్పుడు 22875గా మారింది. గుంటూరు- విశాఖ రైలు నంబర్ 22702 ఉండగా, ఇప్పుడు 22876 అయ్యింది.

Read Also: ఏపీ నుంచి యూపీకి మూడేళ్ల జర్నీ.. అత్యంత ఆలస్యమైన రైలుపై PIB ఆసక్తిర వ్యాఖ్యలు!

అటు భువనేశ్వర్- రామేశ్వరం వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 20896 ఉండగా 20849గా మార్చారు. రామేశ్వరం-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ ను 20895 నుంచి 20850కి ఛేంజ్ చేశారు. భువనేశ్వర్ -పుదుచ్చేరి వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 12898 ఉండగా దాన్ని 20851గా మార్చారు. పుదుచ్చేరి-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 12897 కాస్తా 20852గా ఛేంజ్ చేశారు. భువనేశ్వర్- చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 12830 ఉండగా, 20853గా మార్చారు. చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ నెంబర్ 12829 ఉండగా 20854గా మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. కొత్తగా టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Read Also: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×