BigTV English
Advertisement

Highest Platforms Station: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?

Highest Platforms Station: దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ ఇదే, రోజూ ఇక్కడి నుంచి ఎన్ని రైళ్లు నడుస్తాయంటే?

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన నాలుగో సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా రోజూ సుమారు 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకుల తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా 7,303 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు కలిగి ఉన్న రైల్వే స్టేషన్ ఏదో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు కలిగి ఉన్న రైల్వే స్టేషన్ ఇదే!

దేశంలో అత్యధిక ప్లాట్ ఫారమ్ లు ఉన్న రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లో ఉంది. కోల్‌ కతాలోని హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఏకంగా 23 ప్లాట్‌ ఫారమ్‌ లు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి నుంచి రోజూ సుమారు 1000 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి.


మొత్తం 23 ప్లాట్ ఫారమ్ లు

ఈ రైల్వే స్టేషన్ ను 1854లో గుడిసెలా నిర్మించారు. ఒకే ప్లాట్‌ ఫారమ్ తో ఎర్ర ఇటుకలతో ఏర్పాటు చేశారు. 1900- 1911 మధ్య కాలంలో పునర్నిర్మించారు. ఆ తర్వాత రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం  ఇక్కడ మొత్తం 23 ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి.  నుంచి 14 ప్లాట్‌ ఫారమ్‌ లను టెర్మినల్ 1గా పిలుస్తారు. ఇది పాత కాంప్లెక్స్ లో ఉంటుంది. తూర్పు రైల్వేకు సంబంధించి స్థానిక, సుదూర రైళ్లతో పాటు ఆగ్నేయ రైల్వేకు సంబంధించిన స్థానిక రైల్వే సర్వీసులు ఇక్కడి నుంచి నడుస్తాయి. 17 నుంచి 23 ప్లాట్‌ ఫారమ్‌ లను టెర్మినల్ 2గా పిలుస్తారు. ఇది కొత్త కాంప్లెక్స్ లో ఉంటుంది. ఇక్కడ మరో రెండు ప్లాట్ ఫారమ్ లను నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ఫ్లాట్ ఫారమ్ కూడా ఇక్కడే ఉంది. ప్లాట్‌ ఫారమ్ నంబర్ 1 ఏకంగా 1,296 మీటర్ల పొడవు ఉంటుంది

ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలు

ఇక ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల కోసం అత్యాధునికి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.  డార్మిటరీ, సింగిల్ రూమ్, డబుల్ రూమ్ వసతితో కూడిన ట్రాన్సిట్ ప్యాసింజర్ సౌకర్యం ఉంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులు కోల్‌ కతా స్కైలైన్, హౌరా బ్రిడ్జి  బాల్కనీ వ్యూతో కూడిన ఏసీ ప్రాంతంలో వెయిటింగ్ చేసే అవకాశం ఉంటుంది.  ఈ స్టేషన్‌లో 84 లోకోమోటివ్‌లను ఉంచగలిగే డీజిల్ లోకోమోటివ్ షెడ్ ఉంది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్‌లో 96 లోకోమోటివ్‌లను ఉంచగలిగే స్థలం ఉంది.

దేశంలోనే అత్యధిక రద్దీ.. అత్యధిక ఆదాయం

దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. కోల్‌ కతాను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలుపుతుంది ఈ రైల్వే జంక్షన్. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా 61,329,319 మంది ప్రయాణీకుల రాకపోకలు కొనసాగించారు. అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్లలో హౌరా రైల్వే స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా రూ. 1,692 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది.

Read Also: ఏపీ నుంచి యూపీకి మూడేళ్ల జర్నీ.. అత్యంత ఆలస్యమైన రైలుపై PIB ఆసక్తిర వ్యాఖ్యలు!

Related News

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Big Stories

×