Summer Movies : గతేడాది సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు నిరాశపరిచాయి.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరికొన్ని సినిమాలు అదే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇక ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకున్నాయి. అలాగే ఫిబ్రవరిలో వచ్చిన తండేల్ వంటి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందరి దృష్టి సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల పైనే ఉంది. ఈ ఏడాదిలో సమ్మర్ కి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సమ్మర్ కు స్టార్ హీరోల సినిమాలు దూరం కానున్నాయని మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ముందుగా డేట్ ని అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కి నోచుకోని ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
2025 సందడి చేసిన సినిమాలు..
2025 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు డేట్స్ ను లాక్ చేసుకున్నాయి. అనుకున్నట్లుగా రిలీజ్ అవ్వగా.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది అయితే రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఎక్కువ రోజులు రన్ అవలేదు.. అదేవిధంగా నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజు చిత్రం కూడా యావరేజ్ టాక్ని అందుకుంది. కానీ రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా రికార్డులను బ్రేక్ చేశాయి. ఇక అందరి దృష్టి ఇప్పుడు సమ్మర్ సినిమాలపై పడింది. చాలా సినిమాలు సమ్మర్ లో రిలీజ్ కానీ ఉన్నట్లు అనౌన్స్ చేసుకున్నాయి. దాంతో మూవీ ఆ సినిమాల పై క్యూరియాసిటి పెరిగిపోయింది.. మరి సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..
Also Read : రౌడీలకు చుక్కలు చూపించిన తేనేకళ్ల పాప.. ఇదేం ఫైటింగ్ మామా..
సమ్మర్ మూవీస్..
2025లో సమ్మర్ కు బోలెడు సినిమాలో రిలీజ్ కాబోతున్నాయి.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్‌తో కలిసి నటిస్తున్న ఈ మీద సౌత్‌లో పాటు నార్త్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ ఈ ఏడాది టాక్సిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న డిసెంబర్ మూవీ సమ్మర్ కి రిలీజ్ అయ్యేందుకు డేట్ ని లాక్ చేసుకుంది. అటు రాజా సాబ్ మూవీ కూడా వేసవిలో విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలు సమ్మర్ లో రిలీజ్ అవ్వబోతున్నాయని ఎప్పుడో ప్రకటించేసారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ మూవీని ముందుగా మే 30న థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు అయితే ఇంకా షూటింగ్ పనులు అటు గ్రాఫిక్స్ పనులు పూర్తిగా కాకపోవడంతో ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీ కూడా సమ్మర్ కు విడుదల కాకపోవచ్చని వార్త వినిపిస్తుంది.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ ఉందని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమా ఇంకా చివరి షెడ్యూల్ పూర్తి కాలేదు. పవన్ కళ్యాణ్ ఇంకా డేట్స్ ఇవ్వలేదు ఆ సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ కొత్తగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే సమ్మర్ మూవీస్ వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ హీరోల అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.