Indian Railway Rules: రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో ఎమ్మార్పీకి మించి వస్తువులను విక్రయించకూడదని రైల్వే సంస్థ సీరియస్ గా చెప్పినా, కొంత మంది తీరు మార్పుకోవడం లేదు. తాజాగా ఓ రైల్లో నిర్ణీత ధరకు మించి వాటర్ బాటిళ్లను అమ్మిన ఘటనపై రైల్వే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాటరింగ్ కంపెనీకి ఏకంగా రూ. లక్ష ఫైన్ విధించడంతో పాటు ప్రయాణీకుల నుంచి అధికంగా వసూళు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించింది.
139కి కాల్ చేసిన ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడు
ఈ నెల 12న 12414 నెంబర్ గల పూజా ఎస్ఎఫ్ ఎక్స్ ప్రెస్.. జమ్ము తావి నుంచి అజ్మీర్ జంక్షన్ కు బయల్దేరింది. మార్గం మధ్యలో థర్డ్ ఏసీ బోగీలోకి క్యాటరింగ్ బాయ్ వాటర్ బాటిళ్లను తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్ ధర రూ. 15 ఉండగా, రూ. 20కి అమ్మడం మొదలు పెట్టాడు. ఓ ప్రయాణీకుడుఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినా, సదరు క్యాటరింగ్ బాయ్ రూ. 20 ఇవ్వాల్సిందేనన్నాడు. అన్ని బోగీల్లో అదే ధరకు వాటర్ బాటిళ్లను అమ్మాడు. సదరు ప్యాసెంజర్ ఈ విషయాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేయడంతో పాటు రైల్వే మద్దత్ నెంబర్ 139కు కాల్ చేశాడు. రైల్లో ఎమ్మార్పీ ధరకు మించి వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని కంప్లైంట్ చేశాడు. ఇలా ఫోన్ కట్ గానే అలా క్యాటరింగ్ సంస్థకు కాల్ వచ్చింది. వెంటనే ప్రయాణీకుల నుంచి అధికంగా వసూళు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.
క్యాటరింగ్ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించిన రైల్వే సంస్థ
రైల్వే అధికారుల ఆదేశాలో ఏ క్యాటరింగ్ కుర్రాడు ఎక్కువ ధరకు వాటర్ బాటిళ్లు అమ్మాడో, అదే కుర్రాడు ఎక్కువగా వసూళు చేసిన డబ్బులను ప్రయాణీకులకు అందజేశాడు. అంతేకాదు, విచారణ తర్వాత రైల్వే ఆదేశాలను లెక్క చేయకుండా అధిక ధరకు వాటర్ బాటిళ్లను అమ్మిన సదరు క్యాటరింగ్ సంస్థకు ఏకంగా రూ. లక్ష రూపాయలు జరిమానా విధించింది.
139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।
यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml
— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024
ఎక్కువ ధరకు అమ్మితే ఎలా ఫిర్యాదు చేయాలంటే?
⦿ రైల్లో ఎమ్మార్పీకి మించి వస్తువులను అమ్మితే వెంటనే 139కి కాల్ చేయాలి.
⦿ PNR నంబర్‌ని అడుగుతారు.
⦿ PNR నెంబర్ చెప్పగానే కంప్లైంట్ ఫైల్ చేస్తారు.
అటు రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 1800111139కి కాల్ చేసి కూడా కంప్లైట్ చేసే అవకాశం ఉంది. మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఏ రైల్లో ప్రయాణిస్తున్నా, ఎమ్మార్పీకి మించి వస్తువులను అమ్మితే 9717630982కు మెసేజ్ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చని అధికారులు వెల్లడించారు.
Read Also: 13 దేశాలను కలిపే ఏకైక రైలు, ప్రపంచంలో ఇదే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ!