Vijay Tamannaah marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా భాటియా (Tamannah bhatia) . ‘శ్రీ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ‘హ్యాపీడేస్’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి చిందాడిన ఈ ముద్దుగుమ్మ, భారీ పాపులారిటీ అందుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ తరం హీరోయిన్స్లో నయనతార (Nayanthara)తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో సుదీర్ఘ ప్రయాణం చేసిన హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో హీరోయిన్ గా తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి.
తమన్నా – విజయ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్..
మరొకవైపు బాలీవుడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ వర్మ (Vijay Varma). ఇతడితో ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించగా ఆ వార్తలను నిజం చేసింది ఈ జంట. అయితే ఇప్పుడు తాజాగా శుభవార్త చెప్పబోతున్నారు. డిసెంబర్లో తమన్నా భాటియా – విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అందుకోసం ఇద్దరూ కలిసి హైదరాబాదులో కొత్త ఇంటి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. కొత్త ఇల్లు దొరికిన వెంటనే డిసెంబర్ ఆఖరున లేదా వచ్చే యేడాది మొదట్లో వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఇద్దరు కూడా సన్నహాలు ప్రారంభించారని తెలిసింది.
పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇస్తారా..
అంతేకాదు ఈ జంట ప్రేమ నుంచి.. తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం పై ఆసక్తి చూపిస్తున్నారట. ఇక అందుకే పెళ్లి తర్వాత కలిసి జీవించడానికి ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ కావాలి కాబట్టి వెతుకుతున్నట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరూ ఈ విషయాలపై అధికారిక ప్రకటన చేయకపోయినా వీరిద్దరికీ సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
2023లో బహిరంగ ప్రకటన..
ఇదిలా ఉండగా 2023 సంవత్సరంలో ‘లస్ట్ స్టోరీస్ -2’ విడుదల సమయంలో ఈ జంట తమ సంబంధాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి అదిగో పెళ్లి.. ఇదిగో ఏడడుగులు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ జంట పెళ్లి పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన చేస్తారా లేక ఎప్పటిలాగే సైలెంట్ అవుతారు అన్నది తెలియాల్సి ఉంది.
విజయ్ వర్మ సినీ ప్రస్థానం..
ఇక విజయ్ వర్మ విషయానికి వస్తే.. హైదరాబాదులో స్థిరపడిన మార్వాడి కుటుంబానికి చెందినవారు. సినిమా రంగం మీద ఆసక్తితోనే పూణేలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ కి దరఖాస్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో స్నేహితుల సహాయంతో అందులో ఎఫ్.టి.ఐ కోర్సులో చేరి కోర్సు పూర్తి చేశారు. ఇక హైదరాబాదులో నాటక రంగంలో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 2008లో షార్ట్ ఫిలింలో నటించి కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటుడిగా మారారు.