దీపావళి పండుగ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేలా తగి చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ECoR ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అక్టోబర్ 18 (శనివారం) నుంచి 19 (ఆదివారం) వరకు ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.
పండుగ నేపథ్యంలో భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు శనివారం సాయంత్రం 7.15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరుతుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 18, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ధన్‌బాద్-భువనేశ్వర్ స్పెషల్ సాయంత్రం 4 గంటలకు ధన్‌బాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
ఈ రైలు అక్టోబర్ 18, 19 తేదీలలో రాత్రి 8.25 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ధన్‌బాద్ చేరుకుంటుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రైలు అక్టోబర్ 18న మధ్యాహ్నం 2.55 గంటలకు పూరి నుండి బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పాట్నా చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 08440, పాట్నా-పూరి) స్పెషల్ అక్టోమర్ 19న మధ్యాహ్నం 1.30 గంటలకు పాట్నా నుంచి బయల్దేరి అక్టోబర్ 20న ఉదయం 9.45 గంటలకు పూరికి చేరుకుంటుంది.
ఈ రైలు అక్టోబర్ 19(ఆదివారం) మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. అక్టోబర్ 20(సోమవారం) మధ్యాహ్నం 12.45 గంటలకు బెంగళూరు SMVB చేరుకుంటుంది.
ఈ రైలు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 18న(శనివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం నాడు విశాఖపట్నం చేరుకుంటుంది. పండుగకు హైదరాబాద్ నుంచి వైజాక్ కు వెళ్లాలనుకునే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది.
Read Also: దీపావళికి కన్ఫార్మ్ టికెట్లు కావాలా? ఈ 5 టిప్స్ పాటించాల్సిందే!
ప్రయాణీకులకు ఇబ్బంది లేని, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకునేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకొని హాయిగా జర్నీ చేయాలని సూచించారు.
Read Also: పండుగ సీజన్ లో టికెట్ కన్ఫార్మ్ కావాలా? సింపుల్ గా ఈ స్కీమ్ ట్రై చేయండి!