Brahmamudi serial today Episode: కనకం ఇంటి ముందు ధర్నా చేస్తున్న రాజ్ దగ్గరకు మీడియా వాళ్లు వస్తారు. రాజ్ పక్కనే ఉన్న తాగుబోతు ఏదేదో మాట్లాడుతుంటాడు. కావ్య చూసి నవ్వుతుంటుంది. ఇంతలో మీడియా వాళ్లు రాజ్ బిడ్డ విషయంలో కావ్యను ఇబ్బంది పెడుతున్నాడట కదా అని అడగ్గానే.. రాజ్ కన్నా ముందే తాగుబోతు ఏదేదో చెప్తుంటాడు. దీంతో రాజ్ కన్పీజ్ అవుతుంటాడు. ఇంతలో కావ్య వచ్చి చూడండి మీకు మొన్నే నేను చెప్పాను కదా..? మా మధ్య ఎటువంటి గొడవలు లేవని.. ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం లేదని అనగానే.. మరి ఈ టెంటు ఇవన్నీ ఏంటి మేడం అని మీడియా వాళ్లు అడగ్గానే.. ఆయనేదో సరదాగా నన్ను ఏడిపించడానికి ఈ పని చేస్తున్నారు. మీరేమో ఈ తాగుబోతు మాటలు నమ్మి వచ్చేశారు.. దయచేసి వెళ్లిపోండి అని చెప్పగానే.. మీడియా వాళ్లు సరే మేడం అంటూ వెళ్లిపోతారు.
రాజ్ హమ్మయ్య సమయానికి ఇది వచ్చి అడ్డుపడింది కాబట్టి సరిపోయింది లేదంటే మొత్తం పెంట పెంట అయిపోయేది అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కావ్య నేను కనక ఒక్క మాట నా కడుపులో బిడ్డని నా భర్తే చంపుకోమంటున్నాడని వాళ్లకు చెప్పి ఉంటే మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవుతుందా..? అని చెప్పగానే.. తాగుబోతు ఏంటి నువ్వు చెప్పేది నిజమా..? నీ కడుపులో బిడ్డను చంపేసుకోమంటున్నాడా..? అందుకే దీక్ష చేస్తున్నాడా..? అని అడగ్గానే.. అవును నువ్వే చెప్పు అన్నయ్య ఏ ఆడపిల్లైనా తన కడుపులో బిడ్డను పోగొట్టుకోవడానికి ఒప్పుకుంటుందా..? అని కావ్య చెప్పగానే.. చీ నీ కన్నా నా పెళ్లామే నయం కదా బ్రదర్ నాలుగు దెబ్బలేసినా రాత్రి ఇంటికి పోగానే రెండు ముద్దుల పెట్టి రెండు ముద్దులు పెడుతుంది.
నువ్వేంటి బ్రదర్ ఏకంగా బిడ్డను చంపేసుకోమంటున్నావు చీచీ తాగుబోతునైనా నాకంటూ కొన్ని వ్యాల్యూస్ ఉన్నాయి. నీ లాంటి వాడికి నేను ఎప్పుడు సపోర్టు చేయను బ్రదర్. ఇక నుంచి నా సపోర్టు మొత్తం నా చెల్లెలికే… చెల్లెమ్మా నీకు ఏదైనా కష్టం వస్తే ఒక చిన్న కేక వేయ్ పక్కింట్లోనే ఉంటాను పరుగెత్తుకుంటూ వస్తాను అంటూ రాజ్‌ను తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. దీంతో కావ్య ఏవండి ఇప్పటికైనా మీ ఆలోచన తప్పు అని ఒప్పుకుని లోపలికి వస్తరా..? నేను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకో క్లారిటీ ఉంది. నాతో పాటు నువ్వు వచ్చే వరకు ఈ దీక్ష మాత్రం ఆపను.. భార్యల మొండి తనం నశించాలి. భర్త మాటే వేదవాక్కు.. అంటూ నినాదాలు చేస్తూ కూర్చుంటాడు.
ఇంట్లో కూర్చుని ఫోన్ మాట్లాడిన ఇంద్రాదేవి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అపర్ణ ఏంటి అత్తయ్యా ఫోన్‌లో ఏదైనా కార్టూన్ చూశారా..? మీలో మీరే చిన్న పిల్లలా అలా నవ్వుకుంటుంన్నారు..? ఏంటి విషయం.. అని అడగ్గానే.. విషయం తెలిస్తే నువ్వు నవ్వుతావు తెలుసా..? అని ఇంద్రాదేవి చెప్తుంది. దీంతో అపర్ణ ఏం జరిగింది అత్తయ్యా అని అడుగుతుంది. నీ కొడుకు తిక్క కుదిరింది.. అని ఇంద్రాదేవి అనగానే.. తిక్క కుదరడం ఏంటి..? అత్తయ్య అని అడగ్గానే.. కనకం ఇంటి దగ్గర జరిగిన తాగుబోతు.. మీడియా వాళ్లు వచ్చాక జరిగిన విషయం కనకం చెప్పిందని చెప్పి మరీ నవ్వుకుంటుంది ఇంద్రాదేవి.
రాజ్ దీక్ష దగ్గరే పడుకుంటే కావ్య చూసి జాలి పడుతుంది. పాపం రోజూ ఏసీలో పడుకునే వారు ఇవాళ ఆ దోమల మధ్య పడుకున్నారు. పాపం ఒక దుప్పటి అయినా తీసుకొచ్చి ఇద్దా అనుకుని లోపలికి వెళ్లి దుప్పటి తీసుకొస్తుంటే.. కనకం అడ్డుపడుతుంది. ఈ దుప్పటి ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావే అని అడుగుతుంది. దీంతో కావ్య పాపం ఆయన ఆ దోమల్లో నిద్రపోలేకపోతుంటేనూ.. అని చెప్పగానే.. ఓహో.. పాపమని జాలిపడి దుప్పటి ఇవ్వడానికి వెళ్తున్నావా… నీకు అసలు బుద్ది ఉందా..? ఇలా అల్లుడి గారికి అన్ని ఇస్తుంటే.. ఆయనకు ఇబ్బంది ఏం ఉంటుంది. నిర్ణయం మార్చుకోవాలనే ఆలోచన ఎలా వస్తుందే.. అని కనకం అడగ్గానే.. కానీ ఆయన్ని కష్టపెట్టి మార్చుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అని కావ్య చెప్పగానే.. కష్టపడకుండా మనిషి ఎలా మారుతాడే అల్లుడి గారి మనసు ఎలా మార్చాలో ఐడియా చెప్తాను విను.. అంటూ కనకం ఐడియా చెప్తుంది. దీంతో కావ్య నాటుకోడి కూర వేసుకుని రాజ్ ముందుకు వెళ్లి కూర్చుని తింటుంది. అల్లుడు గారు అన్ని మీకు నచ్చే విధంగా చేశాను అని చెప్తుంది. ఇద్దరూ కలిసి రాజ్ దీక్షను భగ్నం చేయాలని చూస్తారు. కానీ రాజ్ కన్వీన్స్ కాడు.
మరోవైపు అపర్ణ ఇంట్లో భోజనం చేయకుండా రాజ్ అక్కడ అన్నం తినకుండా ఎలా ఉన్నాడో అంటూ బాధపడుతుంది. దీంతో ఇంద్రాదేవి కోప్పడుతుంది. మనిషిలో మార్పు రావాలంటే కష్టపడక తప్పదు అంటుంది. వాడు మారిపోయి మనిషిగా మారితే అందరం సంతోషిస్తాము కదా అంటుంది. మరోవైపు కావ్య, మూర్తి తో రాజ్‌కు భోజనం పంపిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా తీసుకొచ్చానని చెప్పి ఇవ్వండి అనగానే మూర్తి భోజనం తీసుకుని వెళ్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.