Indian railways: భారతీయ రైల్వేలు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ మార్గం. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తారు. కానీ రైల్వే రూల్స్ గురించి చాలా మందికి అవగాహన ఉండదు. భారతీయ రైల్వేకు సంబంధించిన కొన్ని నియమాలు మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా సమయాన్ని ఆదా చేస్తాయి. అంతే కాకుండా వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తాయి. మీరు కూడా రైలు ప్రయాణీకులైతే , తరచుగా రైలులో ప్రయాణిస్తుంటే.. మాత్రం ఈ ఐదు నియమాలను తప్పక తెలుసుకోవాలి.
టికెట్ క్యాన్సల్:
భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిల్ నియమాలను చాలా పారదర్శకంగా నిర్వహిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే.. ప్రయాణానికి 4 గంటల ముందు వరకు దానిని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టికెట్ కన్ఫామ్ కాకపోతే..టికెట్ క్యాన్సిల్ అవుతుంది. మీ డబ్బు రిజర్న్ చేయబడుతుంది. తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మాత్రమే తిరిగి డబ్బు చెల్లిస్తారు. సాధారణ టికెట్ అయినా కూడా టికెట్ మొత్తంలో కొంత కట్ చేసుకుని తిరిగి మీకు రిటర్న్ ఇస్తారు.
మహిళలకు ప్రత్యేక సౌకర్యం:
రైల్వే మహిళలు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక తగ్గింపులు, సౌకర్యాలను అందిస్తోంది. చాలా రైళ్లలో మహిళలకు రిజర్వు చేయబడిన కోచ్‌లు ఉంటాయి. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లు (పురుషులకు 60 ఏళ్లు పై బడినవారు, మహిళలకు 58 ఏళ్లు పైబడినవారు) ఛార్జీలపై 40% నుండి 50% వరకు తగ్గింపు ఉంటుంది. అదనంగా, వీల్ చైర్లు, బ్యాటరీ కార్లు, సహాయక సేవలు కూడా ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని ప్రయాణం సమయంలో మీరు ఉపయోగించుకోవచ్చు.
వెయిటింగ్ హాల్స్:
మీ రైలు ఆలస్యంగా వస్తే లేదా మీరు స్టేషన్‌లో వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు రైల్వే స్టేషన్‌లలో వెయిటింగ్ రూమ్ , క్లోక్ రూమ్‌ను ఉచితంగా లేదా కాస్త డబ్బు కట్టి ఉపయోగించవచ్చు. మీరు మీ బరువైన సామానును క్లోక్ రూమ్‌లో సేఫ్ గా ఉంచుకోవచ్చు . ఒక రోజు ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
రైలు మిస్ అయినా మళ్ళీ ప్రయాణించే అవకాశం:
మీరు కన్ఫార్మ్ టికెట్ తీసుకొని, రైలు అందుకోలేకపోతే. . తరువాతి స్టేషన్ నుండి కూడా ప్రయాణించవచ్చు. TT మీ సీటును మరెవరికీ ఇవ్వకపోతే.. దీని కోసం మీరు స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాలి. ఈ రూల్ చాలా మంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: పాక్‌లో మందుల కొరత, పిట్టల్లా రాలిపోతున్న జనం
రైలులో ఆహారం గురించి నియమాలు , హక్కులు:
ఐఆర్ సీటీసీ నడిపే రైళ్లలో ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి, ప్రయాణీకులు ఇప్పుడు ఆన్‌లైన్ ఆప్షన్, ఎస్ఎంఎస్ , ఫోన్ కాల్స్ ద్వారా ఆర్డర్ చేసే అవకాశం ఉంది. మీరు ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా సకాలంలో అందకపోతే.. మీరు డబ్బు వాపసు పొందే హక్కు కలిగి ఉంటారు. అలాగే.. ట్రైన్ లో ఆహారం క్వాలిటీ లేకపోతే 139కి ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికుల ఫిర్యాదులకు వెంటనే అధికారులు స్పందిస్తారు.