BigTV English

Re-release: కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెస్ట్.. డిస్ట్రిబ్యూటర్స్ న్యూ డిమాండ్

Re-release: కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెస్ట్.. డిస్ట్రిబ్యూటర్స్ న్యూ డిమాండ్

Re-release: గత కొంతకాలంగా టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. గతంలోను టాలీవుడ్ లో బడా హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యేవి.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చాలాసార్లు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు చిన్న, పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరి హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగు కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ చేస్తే బెస్ట్ అనే డిమాండ్ తో డిస్ట్రిబ్యూటర్లు ఉంటున్నట్లు సమాచారం.. అలా అనడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ ..

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ట్రెండ్ కొనసాగుతోంది.. అదే కొత్త సినిమాల రిలీజ్ కంటే పాత సినిమాలు రీ రిలీజ్ చేయటంతో.. కొత్త సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్స్ ని రీ రిలీజ్ సినిమాలు వసూలు చేయడం విశేషం.. థియేటర్లలో పాత బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చేస్తే నిర్మాతలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇది చూసిన డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ పాత సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మనం ఇప్పుడు చూస్తే గత కొన్ని నెలలుగా గబ్బర్ సింగ్, పోకిరి, ఒక్కడు వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అభిమాన హీరోల పాత సినిమాలైనా సరే థియేటర్లకు వెళ్లి మరి చూడాలనే కోరికతో యూత్ ఉండడం దీనికి కారణం. పైగా నిర్మాతలకైనా, డిస్ట్రిబ్యూటర్ల కైనా పాత సినిమాలను రిలీజ్ చేయడం ద్వారా రిస్క్ తగ్గుతుంది. దానికి కారణం ప్రమోషన్స్ ఖర్చు ఉండదు. ఇక ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కొత్త సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడం కన్నా.. ఫాన్స్ బ్లాక్ బస్టర్ హిట్టు చేసిన సినిమాలను మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తే లాభం వస్తుందని, భారీగా వసూలు కాకపోయినా నష్టమైతే రాదు అన్న లెక్కలోకి వచ్చారు.


పాత సినిమాల హావ ..

గత కొన్ని సంవత్సరాలుగా రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. పాత సినిమాలను 4Kలో మళ్లీ రిలీజ్ చేసి సినీ ప్రేమికులను ఆకట్టుకునే పనిలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఎక్కువగా 4K లో తమ అభిమాన హీరో సినిమా చూడటం కోసం థియేటర్లకి వెళ్తున్నారు. తాజాగా మార్చి నెలలో తెలుగు సినిమాలతో పాటు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. వాటిలో మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కార్తీ హీరోగా వచ్చిన యుగానికి ఒక్కడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్, నాని, విజయ్ దేవరకొండల ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు ఈ నెలలో రీ రిలీజ్ అయ్యాయి. ఇలా పాత సినిమాలు రీ రిలీజ్ చేయడం వల్ల కొత్త సినిమాలకు మరింత కష్టాలు తప్పవన్న అభిప్రాయము ఉంది. కొత్త టాలెంట్ ఎదగాలంటే కొత్త సినిమాలు బయటికి రావాలి. వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలా పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తే.. చిన్న సినిమాలు రిలీజ్ కి నోచుకోకుండా పోతాయని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రీ రిలీజ్ కల్చర్ ఒక ట్రెండ్ గా మారిపోతుందో, కొంతకాలం తాత్కాలికంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Chandra Mohan : బ్రాహ్మణుడే… కానీ, నరమాంసం అయినా తినేస్తాడు.. ఆ సీనియర్ నటుడు మరీ అలాంటోడా..?

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×