E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీలు జంప్.. మిగిలినవారు..?

Hyderabad News: హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీలు జంప్.. మిగిలినవారు..?
Advertisement

Hyderabad News: కశ్మీర్ లోని పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయుుల వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. నిర్దేశిత గడువులోగా పాకిస్థాన్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులకు కొత్త టెన్షన్ మొదలైంది. భారత్ నుంచి తమ దేశానికి పాక్ పౌరులు పయనం పట్టారు.

కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌‌లో నమోదైన పాకిస్థాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే డీజీపీ జితేందర్ కీలక విషయాలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు..

తెలంగాణలో 230 మంది పాకిస్థానీయులు ఉన్నారని.. వీరిలో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదని ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని చెప్పారు. షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నామని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉందని స్పష్టం చేశారు. మిగిలిన వారు తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండచివెళ్ళిపోవచ్చని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

హైదరాబాద్ విడిచి వెళ్లిన నలుగురు పాకిస్థానీలు..

ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థాన్ దేశీయులు వెళ్లారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ షార్ట్ టర్మ్ వీసా దారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసుల నోటిసులు పంపారు. పోలీసుల నోటిసులు, కేంద్ర ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ లో నలుగురు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు. మెడికల్ తో వచ్చిన వారికి ఈనెల 29 వరకు మినహాయింపు ఇచ్చారు.  ఈ నెల 30 లోపు ఆటరీ బోర్డర్ నుండి వెళ్లాలని మరోసారి పోలీసులు సూచించారు.

లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారికి మినహాయింపు..

మిగతవారి వీసాలను వివిధ కేటగిరీలకు సంబంధించిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది మంది లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. సైబరాబాద్ లో 11 మంది లాంగ్ టర్మ్ వీసా కలిగిన ఉన్నారని చెప్పారు. ఓ మహిళ షార్ట్ టర్మ్ వీసాతో ఉన్నప్పటికీ కోర్టు కేసు నడుస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు. 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారికి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×