BigTV English

Pakistan: పాక్‌లో మందుల కొరత, పిట్టల్లా రాలిపోతున్న జనం

Pakistan: పాక్‌లో మందుల కొరత, పిట్టల్లా రాలిపోతున్న జనం

Pakistan: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులపై.. భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల కారణంగా అక్కడి పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఇండియా తీసుకుంటున్న చర్యలు పాక్‌కు భారీగా నష్టం కలిగిస్తున్నాయి. దీంతో అక్కడి అధికారులు వివిధ సంస్థలను అప్రమత్తం చేస్తున్నారు. అంతే కాకుండా పొరుగు దేశాల సాయం కోరుతున్నారు.


భారత్ .. పాక్ తో వాణిజ్య సంబంధాలను  నిలిపివేసిన వెంటనే.. తమ దేశంలో మందుల కొరత ఏర్పడుతుందని పాకిస్తాన్ భయపడటం ప్రారంభించింది. మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలలో 30 నుండి 40% ఇండియా నుండే ఎగుమతి అవుతాయి. భారత్ యొక్క ఈ నిర్ణయం అక్కడి ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాక్  అధికారులు భావిస్తున్నారు.

ఓ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఫార్మా రంగంపై ఆంక్షల ప్రభావం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కానీ మందుల కొరతను నివారించడానికి ఆకస్మిక చర్యలు అమలు చేస్తోందట. అంతే కాకుండా మందుల అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.


యాంటీ-రేబిస్ వ్యాక్సిన్‌లు, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ మందులను దిగుమతి చేసుకునేందుకు చైనా, రష్యా, అనేక యూరోప్ దేశాల ప్రత్యామ్నాయ వనరుల కోసం అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అంతే కాకుండా వివిధ రకాల పరిశ్రమ వర్గాలు, ఆరోగ్య నిపుణులకు తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

పాక్ గగనతలం మూసివేయబడింది… DGCA సలహా:
భారత విమానాల కోసం పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన తర్వాత, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ విమానయాన సంస్థలకు ఒక సలహా జారీ చేసింది. అదనపు ఆహారం, నీరు , మందుల కోసం ఏర్పాట్లు నిర్వహించాలని ఆదేశించింది.

ఇలాంటి సందర్భంలో.. డిమాండ్ మేరకు మందులు అందించాల్సి ఉంటుంది. గగనతలం మూసివేయడం వల్ల, అంతర్జాతీయ విమానాల మార్గం మారిపోయింది. దీని కారణంగా ప్రయాణ సమయం కూడా పెరిగింది. ఫలితంగా పాకిస్తాన్ లో వివిధ రకాల వస్తువుల డిమాండ్ బాగా పెరుగుతోంది.

ఇదిలా ఉంటే భద్రతా కారణాల దృష్ట్యా.. పాకిస్తాన్ పౌరులు చార్‌ధామ్‌ను సందర్శించకుండా భారత మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయం కారణంగా.. చార్‌ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్న 77 మంది పాకిస్తానీ హిందూ భక్తులు  యాత్రలో పాల్గొనలేరు.

ఈసారి చార్‌ధామ్ యాత్ర పట్ల భక్తులలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 21 లక్షల మంది యాత్రకోసం పేర్లు నమోదు చేసుకున్నారు. యాత్రలో పాల్గొనేందుకు విదేశాల నుండి 24,729 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రత్యేకత ఏమిటంటే పాకిస్తాన్ నుండి 77 మంది భక్తులు కూడా ఈ పవిత్ర ప్రయాణంలో చేరడానికి ఆసక్తితో ఉన్నారు.

Also Read: ఉదయం 3 గంటలకు నిద్ర లేస్తున్నారా ? జాగ్రత్త

100 కి పైగా దేశాల భక్తులు:
పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత.. కేంద్ర ప్రభుత్వం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణంలో ఎటువంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది  చార్‌ధామ్ యాత్రలో 100 కి పైగా దేశాల నుండి భక్తులు పాల్గొనబోతున్నారు.

చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుండి ప్రారంభం:
చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుండి ప్రారంభమవడం గమనార్హం. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి , యమునోత్రి ధామ్‌ల దర్శనం కోసం లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటారని అంచనా.

Related News

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు

Big Stories

×