E-Paper
Advertisement

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!
Advertisement

నిజామాబాద్ జిల్లాలో ఆ నియోజ‌క‌వర్గంపై ఇప్పుడు స్పెష‌ల్ టాక్ న‌డుస్తోంది. అక్క‌డ ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు… ఏకంగా న‌లుగురు అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. నీకా నాకా..? అనే రేంజ్‌లో నిత్యం దీనిపైనే గురి పెట్టారు. పోటాపోటీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. నాకే టికెట్ అంటూ గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రి గ్రూపులు వారే మెయింటేన్ చేస్తున్నారు. కానీ, ఇక్క‌డ్నుంచే పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కూడా బ‌రిలోకి దిగితే.. !ఇంత ఆస‌క్తి, ఉత్కంఠ రేపుతున్న ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏదో తెలుసా?

ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు

అది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ గెలిచింది బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి. స్వ‌ల్ప ఓట్ల‌తో ఓడిపోయారు కాంగ్రెస్ అభ్య‌ర్థి ముత్యాల సునీల్‌రెడ్డి. ఇప్పుడిక్క‌డ ఇత‌నే ఇంచార్జి. సునీల్ ఓడ‌గానే అప్ప‌టికే ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకున్న అధికార పార్టీ లీడ‌ర్లు.. వ‌చ్చేసారైనా త‌మ‌కు అవ‌కాశం దొర‌క‌క‌పోతుందా? అని ఇప్ప‌ట్నుంచే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

ఎవరి ధీమా వారిది..

Advertisement

గ‌తంలో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈర‌వ‌త్రి అనిల్ మ‌ళ్లీ బాల్కొండ‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. డీసీసీ మాజీ అధ్య‌క్షుడు మానాల మోహ‌న్‌రెడ్డి.. ఇది త‌న ఇలాఖానే అంటూ త‌న వ‌ర్గంతో రోజుకో కార్య‌క్ర‌మం చేస్తూ వ‌స్తున్నారు. ఇక అన్వేష్‌రెడ్డి అనే మ‌రో నేత కూడా తానేం త‌క్కువ తిన‌లేదంటూ ఎమ్మెల్యే అభ్య‌ర్థి లెవ‌ల్‌లోనే ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఓడిన సునీల్‌రెడ్డి.. త‌న‌పై ప్ర‌జ‌ల‌కు సానుభూతి ఉంటుంది కాబ‌ట్టి.. ఇంచార్జిగా ఉన్న త‌న‌కే మ‌ళ్లీ అధిష్టానం టికెట్ ఇస్తుంద‌నే ధీమాలో ఉన్నారు.

Also Read: జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడి నుంచే పోటీ?

Advertisement

ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ ఇలాఖ కూడా బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గ‌మే. ఆ నియోజ‌కవ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే భీమ్‌గ‌ల్ మండ‌లం ర‌హ‌త్‌న‌గ‌ర్ ఆయ‌న సొంత గ్రామం. దీంతో మ‌హేశ్‌కు కూడా ఇక్క‌డ నుంచి పోటీ చేసే ఆస‌క్తి ఉంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఆయ‌నే ఎంట్రీ ఇస్తే.. ఇక మా గ‌తేంగానూ అని పెద‌వి విరుస్తున్నార‌ట ఆ మిగిలిన ఆశావ‌హులు. నిజామాబాద్ అర్బ‌న్ నుంచి ప‌లు మార్లు మ‌హేశ్ పోటీ చేసి ఉన్నారు. కానీ ఈసారి బాల్కొండ వైపు త‌న చూపున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇప్పుడు అధికార పార్టీలో బాల్కొండ కాకా రేపుతోంది.

– Written by Dandugula Srinivas, BIG TV

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×