Kaka Movie Story:చిరు బాబీ కొల్లి కాంబోకి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పక్కర్లేదు.గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య వంద కోట్ల క్లబ్ లో చేరి సంచలన విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఇక ఇదే జోడీ కలిసి ఇపుడు కాకా అంటూ మరో సరికొత్త కథని చెప్పేందుకు రెడీ అయిపోయారు.మెగా 158గా వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే చిరు బర్త్ డే కానుకగా గ్లిమ్ప్స్ వచ్చిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా కాకా సినిమా కథ ఇదే అంటూ ఒక క్రేజీ స్టోరీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది
కథ విషయానికి వస్తే సత్యం ‘అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్’లో సూపర్ వైజర్ గా పని చేస్తుంటాడని, అతడికి తన కూతురు పంచప్రాణాలని తెలుస్తుంది.ఇక తన గతం ఎవరికీ తెలీకుండా జీవిస్తున్న సత్యం ఒక అనుకోని సంఘటన కారణంగా ఆ ఆక్వా ఇండస్ట్రీస్ లోని ఒక వ్యక్తికి తన గతాన్ని చెప్పాల్సివస్తుందట.
ఇక గతంలోకి వెళితే గ్యాంగ్ స్టర్ గా కోల్ కతాలో ఏంతో మందిని గడగడలాడించే కాకా గా చెలామణి అవుతాడని, అక్కడి ప్రభుత్వం కూడా కాకా అంటే భయపడే పరిస్థితి వస్తుందట.అయితే అక్కడి లోకల్ రౌడీలు కాకా ఆధిపత్యాన్ని సహించలేక కాకా నమ్మిన బంటుతో కలిసి వెన్నుపోటు పోడుస్తారట.ఇక ఈ క్రమంలో కాకా,తన కూతురు ప్రాణాలతో బయటపడగా,తన భార్యని కోల్పోవడం,చనిపోయే సమయంలో తన భార్యకి ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం తన కూతురిని తీసుకొని ఎవరికీ చెప్పా పెట్టకుండా గోదావరి జిల్లాల్లోకి వస్తాడట .
అయితే ఎదో ఒక పని మీద ఇక్కడికి వచ్చిన కోల్ కతా గ్యాంగ్ కి సత్యం మళ్ళీ కనబడటం, ఈసారి శత్రు శేషం లేకుండా చేయాలని ఆ కోల్ కతా గ్యాంగ్ సత్యం కూతురిని కిడ్నాప్ చేయడంతో సత్యం తిరిగి మళ్ళీ కాకాగా మారి వారి పని పడతాడని తెలుస్తుంది.
also read :‘ఏషనాగుల’పై ట్రోలింగ్ మొదలు.. ఇదేం ఫోక్ సాంగ్ రా బాబూ!
ఈ సినిమా ముఖ్యంగా తండ్రి కూతుళ్ళ ఎమోషన్ తో సాగుతుందని,అందుకే కూతురిని హైలెట్ చేస్తూ’I LOVE YOU DADDY’ అని రాసి ఉన్న కీచైన్ సీన్ ని ప్రధానంగా సినిమాలో హైలెట్ చేశారన్న టాక్ వినిపిస్తుంది.ఇక ఇందులో కీ చైన్ వాటర్ లో పడితే అందరూ వెళ్ళిపోయాక సత్యం ఒక పెద్ద మ్యాగ్నెట్ వాడి దాన్ని తీయడం వంటివి చూపెట్టడం బట్టి సత్యం కేవలం ‘అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్’లో సూపర్ వైజర్ మాత్రమే కాదని అతడికి ఎదో సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ ఉందన్న విషయం అర్థం అయిపోతుందని అల్లేస్తున్నారు నెటిజన్లు.
మొత్తంగా సత్యం ఆలియాస్ కాకా అనే రెండు డిఫరెంట్ షేడ్స్ తో చిరు ఈ సారి పొంగల్ కి బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో రచ్చ చేస్తాడని మురిపోతున్నారు మెగా ఫ్యాన్స్.చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా వినిపిస్తున్న ఈ కథలో నిజం ఎంతో పొంగల్ కి సినిమా బయటికి వస్తే కాని తెలీదు !
also read :టాక్సిక్ మేకింగ్ వీడియో చూశారా? యష్ కష్టం చూస్తే మైండ్ బ్లాంక్