E-Paper
Advertisement

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్.. ఈ పనులు చేశారో జేబుకు చిల్లు తప్పదు!

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్.. ఈ పనులు చేశారో జేబుకు చిల్లు తప్పదు!
Advertisement

Indian Railways New Rules 2026: రైలు ప్రయాణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే అలవాటు ఉన్నవారికి భారతీయ రైల్వే షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ ఫారమ్‌లు, రైలు కోచ్‌లలో శుభ్రతను కాపాడేందుకు జరిమానాలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటివరకు చెత్త వేసిన వారికి ఉన్న రూ.500 జరిమానాను ఏకంగా రూ.1,000కు పెంచింది. కొత్త నిబంధనలు కేవలం చెత్త వేయడానికే పరిమితం కావు. రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతకు భంగం కలిగిస్తే జరిమానాలు విధించే అవకాశం ఉంది. ప్రయాణికులు, రైల్వే స్టేషన్లకు వచ్చే సందర్శకులు కచ్చితంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

ఆగస్టు 24న నోటిఫికేషన్

రైల్వే మంత్రిత్వ శాఖ ఆగస్టు 24న దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ఆధారంగా 2012లో రూపొందించిన పరిశుభ్రతకు సంబంధించిన జరిమానా నిబంధనల్లో ఇప్పుడు మార్పులు చేశారు.  రైల్వే స్టేషన్‌లో కానీ, ప్లాట్‌ఫారమ్‌పై కానీ, రైలు కోచ్‌లో కానీ నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా చెత్తను పడేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి ఉల్లంఘనకు గతంలో రూ.500 జరిమానా ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.1,000కు పెంచారు. జరిమానా చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే విషయం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నిబంధనల ప్రకారం రూ.2,000 వరకు జరిమానా విధించవచ్చు.

మరిన్ని పనులపైనా నిషేధం

Advertisement

రైల్వే ప్రాంగణాల్లో చెత్త వేయడంతో పాటు పరిశుభ్రతకు ఇబ్బంది కలిగించే అనేక కార్యకలాపాలను కూడా నిబంధనలు నిషేధిస్తున్నాయి. నిర్దేశిత ప్రదేశాల్లో కాకుండా వంట చేయడం, స్నానం చేయడం, ఉమ్మివేయడం, మూత్రవిసర్జన,  మలవిసర్జన చేయడం లాంటి పనులు చేయకూడదు. అలాగే, రైల్వే ప్రాంగణాల్లో జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం, వాహనాలు, పాత్రలు లేదా దుస్తులు కడగడం, రైల్వే ఆస్తులపై వస్తువులను నిల్వ చేయడం వంటి చర్యలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి.

పోస్టర్లు, రాతలకూ అనుమతి తప్పనిసరి

రైలు కోచ్‌లు, రైల్వే ఆస్తులపై అనుమతి లేకుండా పోస్టర్లు అతికించడం, నినాదాలు, సందేశాలు రాయడం, చిత్రాలు గీయడం కూడా నిషేధం. ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు సంబంధిత రైల్వే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో పనిచేసే విక్రేతలు, తోపుడు బండ్ల నిర్వాహకులపైనా కొత్త నిబంధనలు బాధ్యతను పెంచాయి. వారు చెత్తను సేకరించేందుకు డస్ట్‌ బిన్లు, తగిన చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలి. సేకరించిన వ్యర్థాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే పారవేయాలి.

పరిశుభ్ర పెంచడమే లక్ష్యంగా..

Advertisement

రైల్వే వ్యవస్థలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేషన్లు, ప్లాట్‌ ఫారమ్‌లు, రైలు బోగీలను పరిశుభ్రంగా ఉంచడం పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ప్రయాణికుల్లో బాధ్యత పెంచడంతో పాటు, చెత్త పారవేతను అరికట్టేందుకు జరిమానాలను పెంచినట్లు తెలుస్తోంది.

Read Also: ఏపీలో కొత్త హైస్పీడ్ కారిడార్.. అరకు నుంచి నూజివీడు వరకు మారనున్న రవాణా ముఖచిత్రం!

Tags

Related News

పై నుంచి చూస్తే దీన్ని అడవి అనుకుంటారు.. కానీ, అది అతి పెద్ద చెట్టు, ఎక్కడుందంటే?

ఏపీలో కొత్త హైస్పీడ్ కారిడార్.. అరకు నుంచి నూజివీడు వరకు మారనున్న రవాణా ముఖచిత్రం!

మంచు ఖండంలో భారత్ మరో రీసెర్చ్ సెంటర్.. ఇంతకీ మైత్రి-2తో కలిగే లాభం ఏంటి?

నేపాల్ విలయానికి చైనానే కారణమా? ముందే హెచ్చరిక ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదా?

మానస సరోవరానికి ఇండియా నుంచి ఎన్నో రూట్లు.. కానీ, నేపాల్ మీదుగానే ప్రయాణమెందుకు?

రైలులో ఊహించని సమస్య.. ఆ దంపతులకు రూ.75 వేలు చెల్లించిన రైల్వే, మీరూ ఇలా చేయండి

చైనా జిరాంగ్ పోర్ట్.. చిన్న ఆనవాలు కూడా లేదాయే – ఆ భవనం అక్కడే ఎందుకు కట్టారు?

Big Stories

Advertisement
×