BigTV English
Advertisement

Indian Railways New Rule: ఇక ట్రైన్ టికెట్ పై పేరు, డేట్ మార్చుకోవచ్చు, కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే

Indian Railways New Rule: ఇక ట్రైన్ టికెట్ పై పేరు, డేట్ మార్చుకోవచ్చు, కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే

Railway Ticket Name And Date Change: ప్రయాణీకులకు మెరుగైన సేవలు కల్పించేందుకు భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇకపై బుక్ చేసిన టికెట్లపై పేరు, డేట్ మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ టికెట్ పై పేరు, తేదీ ఎలా మార్చుకోవాలి? ప్రయాణానికి ఎన్ని రోజుల ముందు వరకు ఈ అవకాశాలన్ని ఉపయోగించుకోవచ్చు? అదనపు ఛార్జీలు ఏమైనా ఉంటాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


టికెట్ పై పేరు ఎలా మార్చుకోవాలంటే?

ప్రయాణీకులు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లపై పేరును ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్ ద్వారా మార్చుకోవడానికి ముందుగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ లోకి లాగిన్ కావాలి. ‘My Transactions’ లేదంటే ‘My Bookings’లోకి వెళ్లాలి. మీరు నేమ్ ఛేంజ్ చేయాలనుకునే టికెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.  ‘Change Passenger Name’ లేదంటే ‘Transfer Ticket’ మీద క్లిక్ చేయాలి. ఎవరి పేరు మీదికి మార్చాలో వారి పేరు, వయసు ఎంటర్ చేయాలి. అవసరమైన ఫీజు చెల్లించగానే టికెట్ మీద పేరు మారుతుంది. కొత్త ఇ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ ద్వారా పేరు మార్చుకోవాలంటే.. దగ్గర్లోని రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి నేమ్ ఛేంజ్ కోసం ఫామ్ ఫిల్ చేయాలి. గతంలో టికెట్ ఉన్నవారి ఐడీ కార్డు, కొత్తగా టికెట్ ఎవరి పేరు మీదికి మార్చాలో వారి ఐడీ కార్డు చూపించాలి. అవసరమైన ఛార్జ్ చెల్లించాక, కొత్త టికెట్ ను అందిస్తారు.


టికెట్ డేట్ ఎలా మార్చుకోవాలంటే?

కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణం వాయిదా పడిన సందర్భంలో టికెట్ డేట్ ను మార్చుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా టికెట్ డేట్ ను మార్చుకోవచ్చు. ముందుగా IRCTC వెబ్‌ సైట్ లేదంటే యాప్ కి లాగిన్ కావాలి. ‘My Transactions’ లేదంటే ‘My Bookings’లోకి వెళ్లాలి. డేట్ మార్చాలి అనుకునే టికెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ‘Change Journey Date’పై క్లిక్ చేయాలి. కావాలి అనుకున్న రోజున సీట్లు అందుబాటులో ఉన్నాయేమో చూసుకోవాలి. ఉంటే అవసరమైన ఫీజ్ చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇక ఆఫ్ లైన్ లో టికెట్ డేట్ మార్చుకోవాలనుకుంటే.. రైల్వే స్టేషన్ కు వెళ్లి డేట్ ఛేంజ్ ఫామ్ నింపి టికెట్ కౌంటర్ లో ఇవ్వాలి. ఐడీ కార్డును చూపించాలి. అవసరమైన ఛార్జీ చెల్లించి కొత్త టికెట్ తీసుకోవాలి.

రైల్వే టిక్కెట్ ఛేంజెస్ ఎంత ఛార్జీ వసూళు చేస్తారంటే?

టికెట్ లోని పేరు మార్పు లేదంటే డేట్ మార్పు కోసం రైల్వే సంస్థ కొంత మొత్తంలో ఫీజు వసూళు చేస్తుంది. టికెట్ రకం, మారే టైమ్ ను బట్టి ఛార్జీలు మారుతాయి. పేరు మార్పు కోసం ఒక్కో ప్రయాణీకుడికి రూ. 100 వసూలు చేస్తారు. డేట్ మార్పు కోసం టికెట్ కోసం ఒక్కో టికెట్ కు రూ. 200 తీసుకుంటారు. ఇతరత్రా తప్పుల సవరణకు రూ. 50 తీసుకుంటారు.

పేరు, డేట్ మార్పుకు సంబంధించిన రూల్స్  

⦿ ప్రయాణానికి కనీసం 24 గంటల ముందు టిక్కెట్ లో మార్పులకు అవకాశం ఉంటుంది.

⦿ కొత్త ప్రయాణీకుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఐడీకార్డును చూపించాలి.

⦿ పేరు, తేదీని ఒక్కో టిక్కెట్‌ కు ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది.

⦿ తత్కాల్ టిక్కెట్లపై పేరు మార్పులు అనుమతించరు.

⦿ AC, స్లీపర్ క్లాస్ టిక్కెట్‌లపై పేరును మార్చుకునే అవకాశం ఉండదు.

⦿ కొత్త టికెట్ ఛార్జీ తక్కువగా ఉంటే వాపసు ఇవ్వరు. ధర ఎక్కువ అయితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: రైలు ఫ్లోర్ మీద కూర్చున్న పెళ్లి కూతురు, వైరల్ పిక్ వెనుక అసలు సంగతి ఏంటంటే?

Related News

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Big Stories

×