OTT Movie :ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ సినిమాలు కుటుంబంతో సహా కలిసి చూసే విధంగా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్యలతో ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూస్తున్నంత సేపు మిడిల్ క్లాస్ వ్యక్తుల జీవితాలు ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “లవ్ అండ్ శుక్ల” (Love and Shukla). కొత్తగా పెళ్లయిన జంట ఫస్ట్ నైట్ కోసం నిరీక్షిస్తూ, కుటుంబంలోని ఆటుపోట్లను ఎదుర్కొనే విధంగా ఈ మూవీ కొనసాగుతుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
శుక్ల ఆటో తోలుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇతని అమాయకత్వానికి కొంతమంది ఆటో డబ్బులు కూడా ఎగ్గొడుతూ ఉంటారు. పెళ్లయితే ఎలా సంసారం చేస్తావో అంటూ స్నేహితులు కూడా ఇతని ఆటపట్టిస్తారు. ఈ క్రమంలో శుక్ల లక్ష్మీ అనే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీరి ఫ్యామిలీ ఒక గదిలో మాత్రమే ఉండటంతో, అందరూ ఒకే చోటు పడుకుంటూ ఉంటారు. వీరి శోభనానికి కొద్ది రోజులు టైం ఉండటంతో విరహవేదనని అనుభవిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే వీరి ఇంటికి శుక్లా చెల్లెలు భర్తతో గొడవపడి తిరిగి ఇంటికి వస్తుంది. ఇలా సాగుతూ ఉండగా భార్యను ఒకసారి ఏకాంతంగా గడపడానికి శుక్లహోటల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ఆమెతో సరదాగా గడుపుదాం అనుకునే లోగానే పోలీసులు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. భార్య ముందే పోలీసు భర్తపై చేయి చేసుకోవడంతో భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇంటికి వచ్చిన భార్య ఏడుస్తూ ఉండటం చూసి, శుక్ల మద్యం బాగా సేవించి ఇంట్లో వాళ్లపై అరవడం మొదలు పెడతాడు. భర్తను వదిలేసిన చెల్లెల్ని మందలిస్తాడు. తన భార్యకి ఎక్కువగా పని చెప్తుండటంతో తల్లిని నిందిస్తాడు. మద్యం మత్తు దిగిన తర్వాత చెల్లెలకు సారీ చెప్పి, భర్త దగ్గరికి వెళ్లాల్సిందిగా కోరుతాడు. వాళ్లిద్దరికి ఎందుకు గొడవ వస్తుందో అని తెలుసుకుంటాడు. భార్యతో వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో కొన్ని సమస్యలను శుక్ల పేస్ చేయాల్సి వస్తుంది. శుక్ల ఎదుర్కొనే ఆ సమస్యలు ఏమిటి? ఇంతకీ శుక్లాకి శోభనం జరుగుతుందా? చెల్లెలు తిరిగి తన భర్త దగ్గరికి వెళుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “లవ్ అండ్ శుక్ల” (Love and Shukla) అనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.