Big Tv Originals: నచ్చిన బెర్త్ లభిస్తే రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా, సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ లో ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. వీటిలో మూడు రకాల బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. అవి, అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్. వీటిలో ఏది బెస్ట్ అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1.అప్పర్ బెర్త్ (ప్రశాంతంగా పడుకోవడానికి బెస్ట్)
లాభాలు: అప్పర్ బెర్త్ ఎక్కువ ప్రైవసీని అందిస్తుంది. నచ్చినప్పుడు పడుకునే అవకాశం ఉంటుంది. మిడిల్, లోయర్ బెర్త్ ప్రయాణీకుల మాదిరిగా సీట్లు అడ్జెస్ట్ చేసుకోవాల్సిన అససరం ఉండదు. వచ్చిపోయే ప్రయాణీకులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఇబ్బందులు: పెద్ద వాళ్లు పైకి ఎక్కడానికి, కిందికి దిగడానికి ఇబ్బంది కలుగుతుంది. లోయర్, మిడిల్ బెర్త్ వారిలో విండోలో నుంచి బయకు చూసే వెసులుబాటు ఉండదు.
యువతీయువకులు, ఒంటరిగా ప్రయాణం చేసే వారితో పాటు ఎక్కువగా నిద్రపోవాలి అనుకునే వారికి ఈ బెర్త్ బెస్ట్.
2.లోయర్ బెర్త్ (పగలు, రాత్రి వేళ బెస్ట్)
లాభాలు: ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎక్కడం, దిగడం లాంటి ఇబ్బందులు ఉండవు. వయసులో పెద్దవారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్నవారికి చాలా బాగుంటుంది. ప్రయాణ సమయంలో విండోలో నుంచి చక్కటి ప్రకృతి అందాలను చూసే అవకాశం ఉంటుంది. డే టైంలో బెర్త్ లను అడ్జెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇబ్బందులు: ఈ బెర్త్ ను మిడిల్ బెర్త్ వారితో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. పగటిపూట నిద్రపోయే అవకాశం ఉండదు. వచ్చేపోయే ప్రయాణీకులతో ఇబ్బంది కలుగుతుంది.
వృద్ధ ప్రయాణీకులు, పిల్లలు ఉన్న కుటుంబాలు, విండో సీటింగ్ ఇష్టపడే వారికి ఈ బెర్త్ బెస్ట్.
3.మిడిల్ బెర్త్ (పడుకోవడానికి ఇబ్బంది)
లాభాలు: రాత్రిపూట మిడిల్ బెర్త్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు. రాత్రిపూట సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇబ్బందులు: పగటిపూట ఈ బెర్త్ ను ఓపెన్ చేయకూడదు. సో, నిద్రపోవాలని ఉన్నా, నిద్రపోయే అవకాశం ఉండదు. స్థలం కాస్త ఇరుకుగా ఉంటుంది. పొడవుగా ఉన్నవారికి ఇబ్బందికరంగా ఉంటుంది.
పగటిపూట షేర్డ్ సీటింగ్ ను పట్టించుకోని, మిడిల్-గ్రౌండ్ ఎంపికను ఇష్టపడే ప్రయాణీకులకు ఈ బెర్త్ నచ్చుతుంది.
వేసవి, చలికాలంలో బెస్ట్ బెర్త్ ఏది?
ఎండాకాలంలో: అప్పర్ బెర్త్ చాలా మంచింది. ఎందుకంటే ఇది థర్డ్ ఏసీలో ఏసీ వెంట్స్ కు దగ్గరగా ఉంటుంది. స్లీపర్ క్లాస్ లో మాత్రం వేడిగా ఉంటుంది.
చలికాలంలో: చలికాలంలో లోయర్ బెర్త్ హాయిగా ఉంటుంది. ముఖ్యంగా స్లీపర్ క్లాస్ లో ఈ బెర్త్ చాలా బాగుంటుంది.
ప్రయాణీకులకు ఏ బెర్త్ బెస్ట్?
వృద్ధ ప్రయాణీకులు, చిన్న పిల్లలు ఉన్నవారికి,పొడవైన వ్యక్తులకు, విండో వ్యూ ఇష్టపడే వారికి దిగువ బెర్త్ బెస్ట్. సోలో ట్రావెలర్స్, లైట్ స్లీపర్స్ కు అప్పర్ బెర్త్ బెస్ట్.
Read Also: రైళ్లలో వీళ్లు ఉచితంగా ప్రయాణించవచ్చు, ఎందుకో తెలుసా?