Veera Dheera Soora..’తంగళాన్’ మూవీ తర్వాత చియాన్ విక్రమ్ (Vikram ) నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘వీర ధీర శూర'(Veera Dheera Soora) .. ఈ సినిమా మార్చి 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల కలెక్షన్స్ సాధించినప్పటికీ.. రెండో రోజు కలెక్షన్స్ భారీగా పడిపోయినట్టు తెలుస్తోంది.అరుణ్ కుమార్ (Arun Kumar) డైరెక్షన్లో చియాన్ విక్రమ్, దుషార విజయన్ హీరో, హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ వంటి వాళ్ళు కీ రోల్స్ పోషించారు. అలా సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసి రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
వీర ధీర శూర సినిమా కలెక్షన్స్..
రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘వీర ధీర శూర’ సినిమా మొదటి రోజే కలెక్షన్స్ లో నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఊహించుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ లేకపోవడంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ.4 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు వచ్చాయి.ఇక రెండో రోజు అయితే ఈ కలెక్షన్స్ భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. బుక్ మై షో లో రెండో రోజు 65.6 లక్షల టికెట్లు మాత్రమే బుక్ అయినట్టు తెలియజేసింది.దీంతో వీర ధీర శూర సినిమా నిర్మించిన నిర్మాతలకు చుక్కెదురైనట్టయింది. ఈ సినిమా రెండోరోజు ఆఫ్లైన్, ఆన్లైన్ కలిపి కేవలం రూ.3.50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది.
also read:Madhavi Latha: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డ మాధవి లత..!
నిరాశలో విక్రమ్..
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పరిస్థితి అంత బాగోలేదని.. కొచ్చి, చెన్నై, త్రివేండ్రం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో ఈ సినిమాకి టాక్ బాగున్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో సినిమా టాక్ అంతగా లేదు అని సమాచారం. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజు కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్టకపోతే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాదు సినిమా హిట్ కొట్టడం కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ.7 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు చేసింది. అయితే ఉగాది,రంజాన్ వంటి వరుస సెలవులు ఉండటంతో సినిమాకి ఏమైనా కలెక్షన్స్ పెరుగుతాయేమోననే ఆశ చిత్ర యూనిట్ లో ఉంది. ఇక విక్రమ్ చేసిన తంగళాన్ మూవీ యావరేజ్ టాక్ రావడంతో వీర ధీర శూర సినిమా పైనే విక్రమ్ ఆశలన్నీ ఉన్నాయి. కానీ ఈ సినిమాకి కూడా అనుకున్నంత టాక్ రాలేదు. మరి చూడాలి ఈ సినిమా కలెక్షన్స్ రాబోయే రెండు రోజుల్లో ఏమైనా పుంజుకుంటాయా లేదా అని.. ఏది ఏమైనా భారీ అంజనాలతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ సినిమా ఇలా కలెక్షన్స్ సొంతం చేసుకోకపోవడం పై అటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.