E-Paper
Advertisement

ప్రయాణికులకు షాక్.. 10 ఎక్స్ ప్రెస్, 4 ప్యాసింజర్ రైళ్ల రద్దు!

ప్రయాణికులకు షాక్.. 10 ఎక్స్ ప్రెస్, 4 ప్యాసింజర్ రైళ్ల రద్దు!
Advertisement

14 Train Cancelled: ఈ నెలలో రైలు ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నవారికి ఇండియన్ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. మొత్తం 14 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 24 వరకు ఈ రైళ్ల రద్దు ప్రభావం ఉంటుందని ప్రకటించింది. ఈ సమయంలో ప్రయాణించే వారు ముందుగానే తమ రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవడం మంచిదని సూచించింది.

ఇంతకీ రైళ్ల రద్దు ఎందుకు?

రైళ్ల రద్దుకు సంబంధించి అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని బిలాస్‌ పూర్ – రాయ్‌ పూర్ మార్గంలో ట్రాక్ మరమ్మతు పనులులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు  రైళ్లు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. గోండియా రైల్వే స్టేషన్‌ లో ప్లాట్‌ ఫారమ్ మరమ్మతులు, ట్రాక్ అప్ డేషన్ పనులు జరుగుతున్నాయి. వీటి వల్ల మెయిన్ ట్రాక్‌ ను కొంతకాలం మూసివేయాల్సి వచ్చింది. అలాగే ఝార్సుగూడ ప్రాంతంలో కొత్త ట్రాక్ వేసే పనులు జరుగుతుండగా, అకల్తారా స్టేషన్‌ లో యార్డ్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక రైలు ప్రయాణాలు మరింత మెరుగుపడతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే, ఈ పనులు జరిగే సమయంలో మాత్రం ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలుగుతుందన్నారు.

పలు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లుపై తీవ్ర ప్రభావం

Advertisement

రైళ్ల రద్దు కారణంగా కేవలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రైళ్లు మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, అక్కడి నుంచి వచ్చే రైళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన రైళ్లు ఈ మార్గంలోనే నడుస్తాయి.

10 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 4 ప్యాసింజర్ రైళ్లు రద్దు

మరమ్మతుల కారణంగా మొత్తం 14 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో 10 ఎక్స్‌ ప్రెస్ రైళ్లు, 4 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రద్దు అయిన ముఖ్యమైన రైళ్లలో షాలిమార్ – లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ ప్రెస్, కోర్బా – అమృత్‌ సర్ ఛత్తీస్‌ గఢ్ ఎక్స్‌ ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్ – రాయ్‌గఢ్ గోండ్వానా ఎక్స్‌ప్రె స్, జ్ఞానేశ్వరి ఎక్స్‌ ప్రెస్, విశాఖపట్నం – హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ ప్రెస్ లాంటి రైళ్లు ఉన్నాయి.

ప్రయాణీకులకు అధికారుల సూచనలు

Advertisement

రైళ్ల రద్దు నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రయాణానికి ముందే తమ రైలు నడుస్తుందా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం NTES యాప్ లేదంటే భారతీయ రైల్వే అధికారిక వెబ్‌ సైట్‌ ను ఉపయోగించుకోవాలన్నారు. ముందుగానే తెలుసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చని సూచించారు.

Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×