E-Paper
Advertisement

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు!
Advertisement

Indian Railway- Weekly Express Trains: భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి  ఏపీ మీదుగా ఒడిశాకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ కల్పించాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ కొత్త సర్వీసులు తూర్పు  భారతాన్ని దక్షిణ భారతంతో కలపనున్నాయి. సుదూర ప్రయాణాలను మరింత సులభంగా మార్చనున్నాయి.

త్వరలో అందుబాటులోకి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లు

మొదటి రైలు సంత్రాగాచి – యలహంక – సంత్రాగాచి ఏసీ ఎక్స్‌ ప్రెస్. ఈ రైలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12:50 గంటలకు సంత్రాగాచి నుండిచి బయలుదేరి, శనివారం తెల్లవారుజామున యలహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఏప్రిల్ 4 నుంచి ప్రతి శనివారం యలహంక నుండి ప్రారంభమవుతుంది. ఈ రైలు ప్రధానంగా కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.

Advertisement

ఇక మరో రైలు షాలిమార్ – ఎంజీఆర్ చెన్నై – షాలిమార్ వీక్లీ ఎక్స్‌ ప్రెస్. ఇది ఏప్రిల్ 6 నుంచి నడుస్తుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2:45 గంటలకు షాలిమార్ నుండి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఏప్రిల్ 7 నుంచి ప్రతి మంగళవారం చెన్నై నుండి ప్రారంభమవుతుంది. చెన్నై వెళ్లే ప్రయాణికులకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

రెండు రైళ్లు ఏపీ మీదుగా ప్రయాణం

ఈ రెండు రైళ్ల ప్రారంభంతో బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా మరింత మెరుగుపడుతుంది. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ఈ అదనపు రైళ్లు చాలా ఉపయోగపడతాయి. ఈ కొత్త రైళ్లు ముఖ్యంగా ఒడిశాలోని ప్రధాన నగరాలు,  పట్టణాలకు ఉపయోగపడనున్నాయి. భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్ వంటి కీలక స్టేషన్లలో ఇవి ఆగుతాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చెన్నై, కర్ణాటక, ఏపీ లాంటి ప్రాంతాలకు ప్రయాణించడం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

Advertisement

Read Also: వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?

అలాగే, ఈ రెండు రైళ్ల మార్గాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ వెళ్తాయి.  ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. కొత్త రైళ్లు ప్రారంభమవడంతో ట్రైన్ టికెట్లు పొందడం కూడా కొంతవరకు ఈజీ అవుతుంది. భారతీయ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో మేలు చేయనుంది. ముఖ్యంగా ఒడిశా నుంచి సౌత్ ఇండియాకు వెళ్లే వారికి మంచి అవకాశం కానుంది.

Read Also: అద్భుతం.. విమానం నుంచి చూస్తే తిరుమల ఎంత అద్భుతంగా ఉందో చూడండి!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×