BigTV English

Indian Railways safety: రైల్వే సేఫ్టీ లో మరో ముందడుగు.. కొత్త సిస్టమ్ తో ట్రైన్ జర్నీ మరింత సేఫ్!

Indian Railways safety: రైల్వే సేఫ్టీ లో మరో ముందడుగు.. కొత్త సిస్టమ్ తో ట్రైన్ జర్నీ మరింత సేఫ్!

Indian Railways safety: ఇండియన్ రైల్వే మరో గొప్ప ఘనత సాధించింది. బాలసోర్ దుర్ఘటన (296 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం) వంటి మానవ తప్పిదాలు, సిగ్నలింగ్ లోపాలతో జరిగే ప్రమాదాలను పూర్తిగా అరికట్టే దిశగా, ఇండియన్ రైల్వే కొత్త డైరెక్ట్ డ్రైవ్ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (DDEI) సిస్టమ్‌ను విజయవంతంగా ప్రయోగాత్మకంగా అమలు పూర్తి చేసింది.


పైలట్ రన్ సక్సెస్..
జమ్మూ, మధ్యప్రదేశ్‌లోని తజ్‌పూర్‌తో పాటు మొత్తం మూడు స్టేషన్లలో ఈ పైలట్ రన్స్ సక్సెస్ కావడంతో, దేశవ్యాప్తంగా ఈ సిస్టమ్‌ను దశలవారీగా అమలు చేసే దిశగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. ఈ కొత్త సిగ్నలింగ్ సిస్టమ్‌లో మానవ జోక్యం దాదాపు పూర్తిగా తొలగిపోవడం వల్ల ఆపరేషనల్ ఎర్రర్ లకు అవకాశం లేకుండా పోతుంది. పాయింట్లు (ట్రాక్ స్విచ్‌లు), సిగ్నల్స్ అన్నీ నేరుగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సాఫ్ట్‌వేర్ ద్వారా నియంత్రించబడటం వల్ల, సాధారణ రీలే-ఆధారిత ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో పోలిస్తే ఇది ఒక పెద్ద సాంకేతిక ప‌రిమార్పు అని అధికారులు తెలిపారు.

ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే?
DDEI వ్యవస్థలో రైలు ముందుకు సాగడానికి ముందు ఎన్ని స్విచ్‌లు ఉన్నా అవన్నీ సరైన దిశలో లాక్ అయ్యాయా, ట్రాక్‌పై ఎలాంటి అడ్డంకి ఉందా, లెవల్ క్రాసింగ్ గేట్లు పూర్తిగా మూసివేశారా అన్న ప్రతి అంశాన్ని వ్యవస్థ స్వతహాగానే చెక్ చేస్తుంది. ఒకేసారి ఒకే రూట్‌నే క్లియర్ చేసే విధంగా ఇది పనిచేస్తుంది. అలా 2 రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా లేదా పరస్పరం ఢీకొనే పరిస్థితి తలెత్తే అవకాశమే లేకుండా సేఫ్టీ లాజిక్‌ను వ్యవస్థలోనే పక్కాగా నిక్షిప్తం చేశారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌లను రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకుని, ఫలితాలు ఎంతో ఉత్సాహపరిచేలా వచ్చాయి, ఇక దీన్ని విస్తృతంగా వినియోగించవచ్చని రైల్వే వర్గాలు వ్యాఖ్యానించాయి.


సాధారణ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (EI) వ్యవస్థలు కీలకంగా రీలేలపై ఆధారపడుతాయి. రీలేలు సిగ్నల్స్, స్విచ్‌లకు కరెంట్‌ను నియంత్రించే ఎలక్ట్రికల్ పరికరాలు కావడంతో, వాటి సంఖ్య ఎక్కువైతే మెయింటెనెన్స్ కూడా అంతే పెరుగుతుంది, ఫాల్ట్ ట్రేసింగ్ క్లిష్టమవుతుంది. DDEI మోడల్‌లో అయితే, సిగ్నలింగ్ గేర్‌ను నేరుగా మానిటర్ చేసి, కంట్రోల్ చేయడంతో రీలేల అవసరం సుమారు 70 శాతం వరకు తగ్గుతుంది.

మెరుపులతో కూడా సేఫ్..
దీంతో నిర్వహణ ఖర్చులు గణనీయంగా పడిపోవడమే కాదు, ఏ ఫాల్ట్ ఎక్కడ వచ్చిందో వెంటనే గుర్తించే అవకాశం కూడా పెరుగుతుంది. ఇదే విధంగా, ఈ కొత్త సిస్టమ్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) వినియోగం వల్ల సాంప్రదాయ కాపర్ కేబుల్స్ అవసరం 60 నుండి 70 శాతం వరకు తగ్గుతుంది. ఇది కేవలం ఖర్చుల పరంగా కాదు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణనూ ఇస్తుంది.

ఈ మొత్తం వ్యవస్థలో ఉన్న ప్లస్సులు అన్నీ ఇన్నీ కావు. రియల్‌టైమ్ గేర్ పొజిషన్ డిటెక్షన్ ద్వారా, డెస్క్‌పై కూర్చొని ఉన్న డిస్పాచర్‌కు, స్టేషన్ మాస్టర్‌కు, కంట్రోల్ రూమ్‌కు.. అన్నివర్గాలకూ తక్షణ సమాచారం అందుతుంది. ఒక ప్రమాదం జరగడం అంటే, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొరపాట్లు ఒకేసారి జరిగి ఉండాలి. అలాంటి పరిస్థితులు సంభవించే అవకాశాలనే DDEI డిజైన్‌లోనే పొందుపరిచారు. అంతేకాకుండా, ఫెయిల్‌సేఫ్ లాజిక్స్, ఆటోమేటెడ్ చెక్‌లు, క్రమం తప్పని డయ్యాగ్నస్టిక్స్ అన్నీ ఇందులో ఉండడం విశేషం.

Also Read: Indian Railways toy train: రైల్వే మరో సృష్టి.. ఫారెస్ట్ క్వీన్ ట్రైన్ వచ్చేసింది.. జర్నీలో అద్భుతాలు చూసేయండి!

ఆ ప్రమాదమే కారణం!
బాలసోర్ ప్రమాదం తర్వాత, దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ సిస్టమ్‌ను టాప్ ప్రాధాన్యంగా తీసుకుని అప్‌గ్రేడ్ చేయాలన్న దృఢసంకల్పంతో రైల్వే శాఖ ముందుకెళ్తోంది. ఇప్పుడు పూర్తయిన ఈ పైలట్ రన్స్, అదే లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రామాణిక అడుగులు. రేపటి రోజుల్లో ఇండియన్ రైల్వే నెట్‌వర్క్ అంతా మీదగా ఈ సిస్టమ్ విస్తరించబోతుందని, ముఖ్యంగా హై-డెన్సిటీ కారిడార్లు, జంక్షన్ పాయింట్లు, క్రిటికల్ సెక్షన్‌లలో దీన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా మానవ తప్పిదం అవకాశం తగ్గుతుంది, సిగ్నలింగ్ ఫాల్ట్‌లు ముందుగానే పట్టుబడతాయి, మెయింటెనెన్స్ కాస్ట్‌లు తగ్గుతాయి, ట్రాఫిక్ హ్యాండ్లింగ్ సామర్థ్యం పెరుగుతుంది, సేవల విశ్వసనీయత, వేగం మెరుగవుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కలిసి, సాధారణ ప్రయాణికుడికి సేఫ్ జర్నీ అనే మాటకు నిజమైన అర్థాన్ని తెచ్చిపెడతాయి. రైల్వేలు ఆధునిక టెక్నాలజీని ఆపరేషనల్ లెవెల్లోకి తీసుకువచ్చి, దేశ రైల్వే నెట్‌వర్క్‌ను వరల్డ్-క్లాస్ సేఫ్టీ స్టాండర్డ్స్ వైపు నెట్టేస్తున్నాయన్నది DDEI సక్సెస్‌కి పెద్ద నిదర్శనం.

బాలసోర్ వంటి విషాదాలను పునరావృతం కాకుండా అడ్డుకునే దిశగా, ఇండియన్ రైల్వేల ఒక గట్టి, గంభీరమైన, సాంకేతికంగా ముందడుగు వేసింది. Direct Drive Electronic Interlocking వ్యవస్థ ప్రయోగాలు విజయవంతమవడం, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించబోవడం ఇది కేవలం రైల్వే సేఫ్టీకే కాదు, ప్రతి ప్రయాణికుడి నమ్మకానికి కూడా ఒక గొప్ప బూస్ట్. ఇదే నిజమైన ఇండియన్ రైల్వే సాధించిన ఘనత. టెక్నాలజీతో ప్రాణాలను కాపాడే భవిష్యత్తు వైపు దూసుకెళ్తున్న అడుగును వేసింది మన రైల్వే. ఎంతైనా ఇండియన్ రైల్వే కదా.. అది మన సత్తా!

Related News

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Airways New Rule: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

Dussehra – Diwali: పండుగ సీజన్ లో భారతీయులు వెళ్లాలనుకుంటున్న టాప్ ప్లేసెస్ ఇవే, మీరూ ట్రై చేయండి!

IRCTC – Aadhaar: వెంటనే ఇలా చేయండి.. లేకపోతే అక్టోబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్ కష్టమే!

TIRUN Cruise: ఫ్యామిలీ ట్రిప్‌కి బంపర్ ఆఫర్.. 60శాతం డిస్కౌంట్, పిల్లలకు ఉచితం

Smallest Railway Station: ఇండియాలోనే అతి చిన్న ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ ఇదే.. అంత చిన్నదా?

Viral Video: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!

Vande Bharat train: పూరికి నేరుగా వందే భారత్ రైలు.. ఎక్కడి నుంచి అంటే?

Big Stories

×