Train Ticket Date Change: నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులకు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది భారతీయ రైల్వే సంస్థ. అంతేకాదు, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నది. ప్రయాణీకులు ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి సౌకర్యాలలో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రయాణం క్యాన్సిల్ అయినా నో ప్రాబ్లం..
రైలు ప్రయాణం చేసేందుకు చాలా మంది ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. కొంత మంది ప్రయాణీకులకు చివరి నిమిషంలో ప్రయాణాలు క్యాన్సిల్ అవుతాయి. అలాంటి వాళ్లు టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ, ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు. ముందస్తుగా బుక్ చేసిన టికెట్లనువేరే తేదీకి మార్చుకునే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే సంస్థ. కానీ, చాలా మందికి ఈ విషయం పెద్దగా తెలియదు. అందుకే, ఉన్న టికెట్ ను క్యాన్సిల్ చేసి, ఆ తర్వాత కొత్త టికెట్ ను బుక్ చేసుకుంటారు.
ఇంతకీ టికెట్ డేట్ ఎలా మార్చుకోవాలంటే?
ప్రస్తుతం బుక్ చేసుకున్న టికెట్ ప్రకారం ప్రయాణం చేయడం కుదరకపోతే, మీకు నచ్చిన తేదీకి మార్చుకోవచ్చు. ప్రజల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. టికెట్ రద్దు చేయాల్సిన అవసరం లేకుండా టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు రైలు బయల్దేరే 48 గంటల ముందు బుకింగ్ కౌంటర్ కు వెళ్లాలి. అక్కడ టికెట్ డేట్ మార్పుకు సంబంధించిన ఫామ్ ఫిల్ చేసి, తగిన డాక్యమెంట్స్ ను సమర్పిస్తే, మీరు అనుకున్న తేదీన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నా కూడా, డేట్ మార్పు కోసం కచ్చితంగా రైల్వే స్టేషన్ లోని కౌంటర్ కు వెళ్లాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగులకు మరింత వెసులుబాటు
సాధారణ ప్రయాణీకులు టికెట్ డేట్ మార్చుకునేందుకు 48 గంటల ముందే రైల్వే కౌంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఉగ్యోదులకు కాస్త వెసులుబాటు ఉంటుంది. వాళ్లు రైలు బయల్దేరేందుక 24 గంటల ముందు కూడా తన ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోలకు ఇతర షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్న భారతీయ రైల్వే సంస్థ తెలిపింది.
Read Also: రైలు టికెట్ పై ఎన్ని సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయో తెలుసా?
క్లాస్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం
ఇక మీరు ప్రయాణ తేదీని మార్చుకోవడంతో పాటు మరో సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. డేట్ మార్పు కోసం రైల్వే స్టేషన్ కు వెళ్లిన సమయంలో.. ప్రస్తుతం ఉన్న తరగతిని అలాగే కంటిన్యూ చేస్తూ డేట్ మార్చుకోవచ్చు. లేదంటే క్లాస్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఎగువ తరగతికి సంబంధించిన అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. సో, ఇకపై మీకు కూడా ప్రయాణం క్యాన్సిల్ అయితే, టికెట్ క్యాన్సిల్ చేయకుండా సింఫుల్ గా డేట్ మార్చుకుంటే సరిపోతుంది.
Read Also: మిడిల్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందా? ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే!