Indian Railways: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరకుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా రైల్వే ప్రయాణంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మూడు రకాల బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్. వీటిలో మిడిల్ బెర్త్ కన్ఫర్మ్ అయిన ప్రయాణీకులు ప్రయాణ సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. సరిగా కూర్చోలేక, పడుకోలేక అవస్థలు పడతారు. ఈ నేపథ్యంలోనే వారికి కోసం భారతీయ రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడుకోవచ్చంటే?
మిడిల్ బెర్త్ ప్రయాణీకులు పడుకునేందుకు నిర్ణీత సమయాన్ని కేటాయించింది భారతీయ రైల్వే. సాధారణంగా మిడిల్ బెర్త్ ప్రయాణీకులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరక మిడిల్ బెర్త్ ను ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకోవచ్చు. ఆ తర్వాత బెర్త్ ను మడిచి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత లోయర్ బెర్త్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. లోయర్, అప్పర్ బెర్త్ లో ప్రయాణించే వారు సౌకర్యవంతంగా కూర్చునేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డే టైమ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిడిల్ బెర్త్ ఓపెన్ చేయడానికి వీలు లేదని రైల్వే నిబంధనలు వెల్లడిస్తున్నాయి.
డే టైమ్ లో మిడిల్ బెర్త్ మూయకపోతే చర్యలు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల త్వారా మిడిల్, లోయర్ బెర్త్ ప్రయాణీకులు అంతా కలిసి లోయర్ బెర్త్ మీదే కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేకుండా రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయం తర్వాత మిడిల్ బెర్త్ క్లోజ్ చేయమని అడిగే హక్కు లోయర్ బెర్త్ ప్రయాణీకుడికి ఉంటుంది. ఒకవేళ తను అడిగినా నిరాకరిస్తే, టీటీఈ లేదంటే ఇతర రైల్వే సిబ్బందికి చెప్పాల్సి ఉంటుంది. వాళ్లు వచ్చి మిడిల్ బెర్త్ క్లోజ్ చేయిస్తారు. అప్పటికీ మాట వినకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
Read Also:రైల్లో అందరూ చూస్తుండగానే పాస్ పోసిన ప్రయాణీకుడు, మరీ ఘోరం భయ్యా!
రైల్వే ప్రయాణంలో పాటించాల్సిన రూల్స్
రైలు ప్రయాణంలో స్మోకింగ్, డ్రింకింగ్ చేయకూడదు. అతిక్రమిస్తే జరిమానా లేదంటే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులు తమ సామాన్లను లోయర్ బెర్త్ కింద, లేదంటే లగేజీ రాక్ ల మీద మాత్రమే పెట్టుకోవాలి. ప్రయాణీకులు నడిచే ప్లేస్ లో పెట్టకూడదు. రాత్రి 10 తర్వాత డిమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి. సెల్ ఫోన్లలో ఎక్కువ సౌంట్ పెట్టకూడదు. ప్రయాణీకులు వారికి కేటాయించిన బెర్త్ లలో మాత్రమే కూర్చోవాలి. సీట్లు మార్పు అనేది ప్రయాణీకులు అంగీకారంతోనే జరగాలి. రైళ్లలోని డస్ట్ బిన్ లలో మాత్రమే వ్యర్థపదార్థాలను పడేయాలి. అత్యవసర పరిస్థితులలో మాత్రమే చైన్ లాగేందుకు అనుమతి ఉంటుంది. అనవసరంగా చైన్ లాగితే ఫైన్ కట్టక తప్పదు.
Read Also: రైలు టికెట్ పై ఎన్ని సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయో తెలుసా?